Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSamsung Galaxy F17 5G: త్వరలో శామ్‌సంగ్ నుంచి బడ్జెట్-ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్‌..ధర, ఫీచర్ల చూస్తే..

Samsung Galaxy F17 5G: త్వరలో శామ్‌సంగ్ నుంచి బడ్జెట్-ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్‌..ధర, ఫీచర్ల చూస్తే..

Samsung Galaxy F17 5G Leaks: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శామ్‌సంగ్ బడ్జెట్-ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్‌ల శ్రేణిని మరోసారి బలోపేతం చేయబోతోంది. ఈ క్రమంలోనే కంపెనీ త్వరలో గెలాక్సీ F17 5G పేరిట మరో కొత్త పరికరాన్ని మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. కొన్ని లీక్స్ ప్రకారం..ఈ శామ్‌సంగ్ ఫోన్ ధర రూ. 15000 కంటే తక్కువగా ఉంటుందని సమాచారం. ఈ ధర బడ్జెట్ 5G విభాగంలో రియల్ మీ, ఐక్యూ,రెడ్ మీ, వివో వంటి బ్రాండ్‌లకు ప్రత్యక్ష పోటీదారుగా నిలుస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ UI 7పై నడుస్తుంది. ఇప్పుడు ఈ శామ్‌సంగ్ పరికరానికి సంబంధించి లీక్ అయినా ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Samsung Galaxy F17 5G: ధర, వేరియంట్లు( అంచనా)

పలు లీక్స్ ప్రకారం..గెలాక్సీ F17 5G ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ బేస్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,499గా, అదేవిధంగా హై-ఎండ్ 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 15,999గా ఉంటుందని సమాచారం.

also read: Smart Phones: రూ.6500 ధరతో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ కొనాలా..? లిస్ట్ ఇదే..

Samsung Galaxy F17 5G: ఫీచర్లు(అంచనా)

5G బడ్జెట్ విభాగంలో గొప్ప ఫీచర్లతో వస్తున్న శామ్‌సంగ్ గెలాక్సీ F17 5G స్మార్ట్ ఫోన్ 6.7-అంగుళాల FHD + సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. డిస్ప్లేపై గొరిల్లా గ్లాస్ రక్షణ కూడా ఉంటుంది. పనితీరు పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ కు ఎక్సినోస్ 1330 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7 ఇవ్వబడుతుంది. ఈ శామ్‌సంగ్ ఫోన్ గీక్‌బెంచ్ లో 975 సింగిల్-కోర్, 2242 మల్టీ-కోర్ స్కోర్‌లను సాధించింది. ఇది దాని బలమైన పనితీరును చూపిస్తుందని అర్థం.

ఇక కెమెరా వినిబాగానికి వస్తే, ఈ ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో రావచ్చు. అలాగే, సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇది 13MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. బ్యాటరీ గురించి చెప్పాలంటే, ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని సమాచారం. దీనితో పాటు, ఫోన్ IP54 రేటింగ్‌తో శామ్సంగ్ నాక్స్ భద్రతను కూడా కలిగి ఉంటుంది. ఇది మరింత సురక్షితంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad