Saturday, November 15, 2025
HomeTop StoriesSamsung Galaxy M17 5G Launched: AI స్మార్ట్ ఫీచర్లతో శామ్సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్..ధర కూడా...

Samsung Galaxy M17 5G Launched: AI స్మార్ట్ ఫీచర్లతో శామ్సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్..ధర కూడా తక్కువే!

Samsung Galaxy M17 5G: శామ్సంగ్ ప్రియులకు గుడ్ న్యూస్! కంపెనీ భారత మార్కెట్లో సరికొత్త శామ్సంగ్ మొబైల్ ను తీసుకొచ్చింది. M-సిరీస్ కింద శామ్సంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ పరికరం గెలాక్సీ M16కి అప్‌గ్రేడ్ మోడల్. 5nm-ఆధారిత ఎక్సినోస్ 1330 చిప్‌సెట్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లతో వవస్తోన్న ఈ పరికరం బుజిత్ ధరలో ఉండటం విశేషం. ఈ ఫోన్ 4GB + 128GB స్టోరేజీ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. చాలారోజుల నుంచి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లతో ఫోన్ కొనాలని చేస్తున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ పరికరం ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

శామ్సంగ్ గెలాక్సీ M17 5G ధర, లభ్యత:

శామ్సంగ్ గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ 4+128GB RAM స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా పేర్కొంది. అలాగే, 6+128GBRAM స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499గా, 8+128GB RAM స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ మూన్ లైట్ సిల్వర్, సాప్ఫిరే బ్లాక్ అనే రెండు ఆకర్షణీయ రంగుల్లో లభిస్తోంది. ఈ ఫోన్ అక్టోబర్ 13 నుంచి అమెజాన్, శామ్సంగ్ వెబ్‌సైట్, ఎంపిక చేసిన ప్రధాన రిటైల్ స్టోర్‌లలో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులు లాంచ్ ఆఫర్లలో భాగంగా రూ.500 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ప్రముఖ బ్యాంకుల కార్డ్స్ ద్వారా 3 నెలల వరకు నో కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.

also read:Cholesterol Foods: కొలెస్ట్రాల్ ను వేగంగా పెంచే ఆహారాలు ఇవే..ఈరోజునుంచే దూరంగా ఉండండి!

శామ్సంగ్ గెలాక్సీ M17 5G ఫీచర్లు:

డిస్ప్లే
ఈ పరికరం 1100 nits గరిష్ట ప్రకాశంతో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. . స్క్రీన్ కి గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో ప్రొటెక్షన్ అందించారు.

ప్రాసెసర్ &ఆపరేటింగ్ సిస్టమ్:
శామ్సంగ్ నుండి వచ్చిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇన్-హౌస్ 6nm ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఈ శామ్సంగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా One UI 7పై నడుస్తూ,నడుస్తూ, జెమినీ లైవ్ ఫీచర్స్ తో వస్తోంది. ఈ పరికరానికి 6 సంవత్సరాల OS అప్‌డేట్‌లు, భద్రతా నవీకరణలను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

కెమెరా
గెలాక్సీ M17 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా, 2MP మాక్రో లెన్స్ కెమెరా ఉన్నాయి.సెల్ఫీల కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

బ్యాటరీ
కంపెనీ ఈ పరికరంలో 5000mAh బిగ్ బ్యాటరీని ఇచ్చింది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఈ ఫోన్ IP54 రేటింగ్‌ ను కలిగి ఉంది. ఈ కొలతలు 164.4 x 77.9 x 7.5mm. బరువు 192 గ్రాములు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad