Samsung Galaxy M17 5G Price and features: టెక్ దిగ్గజం శామ్‌సంగ్ తన మొబైల్ మార్కెట్‌ను వేగంగా విస్తరిస్తోంది. ప్రారంభంలో కేవలం ఫీచర్ ఫోన్లనను మాత్రమే తీసుకొచ్చిన శామ్‌సంగ్.. ఇటీవల వరుస పెట్టి స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తోంది. బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెస్తుంది. శామ్‌సంగ్ తాజాగా తన గెలాక్సీ ఎం సిరీస్ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం17 5జీ పేరిట దీన్ని రిలీజ్ చేసింది. ఈ ఫోన్ అమ్మకాలను ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా జరుపుతోంది. మీరు మంచి మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇందులో ఎక్సినోస్ 1330 చిప్‌సెట్, ట్రిపుల్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ మోడల్ ఆరు ఓఎస్ అప్‌డేట్లు, ఆరు సంవత్సరాల సేఫ్టీ అప్‌డేట్లతో వస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ ఎం17 5జీ ధర, ఆఫర్
భారత మార్కెట్‌లో 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.12,999 నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు, 6 జీబీ + 128 జీబీ,8 జీబీ + 128 జీబీ వేరియంట్లు వరుసగా రూ.13,999, రూ.15,499 వద్ద అందుబాటులో ఉంటాయి. అమెజాన్‌లో దీని కొనుగోలు ద్వారా రూ.500 డిస్కౌంట్ కూపన్‌ను కూడా పొందచ్చు. తద్వారా దీని బేస్ వేరియంట్‌ను కేవలం రూ.12,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇక, అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేసే కస్టమర్లు 3 శాతం వరకు క్యాష్‌బ్యాక్, వెల్‌కమ్ రివార్డులను కూడా పొందవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎమ్ఐ ట్రాన్సాక్షన్లను ఉపయోగించి హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేసే కస్టమర్లకు ఆఫర్లో భాగంగా రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక, కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే.. కంపెనీ వెబ్‌సైట్, అమెజాన్‌లో మూన్‌లైట్ సిల్వర్, సఫైర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. శాంసంగ్ ఈ ఫోన్‌పై మూడు నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్‌లను అందిస్తోంది. ఈఎంఐ నెలకు రూ.5,166 నుండి ప్రారంభమవుతుంది. స్టాండర్డ్ ఈఎమ్ఐ ఆఫర్లు నెలకు రూ.840 నుండి ప్రారంభమవుతాయి.
శామ్‌సంగ్ గెలాక్సీ M17 5G ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ M17 5జీ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7పై పనిచేస్తుంది. ఆరు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల సేఫ్టీ అప్‌గ్రేడ్లు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (1,080×2,340 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1,100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తోంది. డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినోస్ 1330 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. OISతో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా ఉంటుంది. కెమెరా సెటప్‌లో 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటివి ఉంటాయి. గూగుల్, జెమిని లైవ్‌తో సర్కిల్ టు సెర్చ్ వంటి అనేక ఏఐ ఫీచర్లను కలిగి ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ కూడా అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల 5,000mAh బ్యాటరీ ఉంటుంది.

