Saturday, November 15, 2025
HomeTop StoriesSamsung Galaxy M17 5G: శామ్‌సంగ్‌ ఎం సిరీస్‌ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు...

Samsung Galaxy M17 5G: శామ్‌సంగ్‌ ఎం సిరీస్‌ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు చూస్తే వావ్‌ అనాల్సిందే..!

Samsung Galaxy M17 5G Specifications: దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ సంస్థ శామ్‌సంగ్‌ నుంచి మరో కొత్త ఫోన్‌ రిలీజైంది. శామ్‌సంగ్‌ గెలాక్సీ M17 5G పేరిట అక్టోబర్ 10న భారత మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, లాంచింగ్‌కు ముందే గెలాక్సీ M సిరీస్ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కెమెరా యూనిట్‌ టీజర్‌ను సంస్థ విడుదల చేసింది. గెలాక్సీ M17 5G స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఈ ఫోన్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లే, IP54 రేటెడ్ బిల్డ్‌‌తో వస్తుంది. ఈ కొత్త మోడల్‌ను కంపెనీ గెలాక్సీ M16 5G మోడల్‌కు సక్సెసర్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చింది.

- Advertisement -

శామ్‌సంగ్‌ గెలాక్సీ M17 5G స్పెసిఫికేషన్లు..

శాంసంగ్ గెలాక్సీ M17 5G ప్రైమరీ కెమెరా టీజర్ వీడియోను గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఈ మెయిన్ కెమెరాతో యూజర్లు అన్‌స్టేబుల్ కండిషన్స్‌లో కూడా బ్లర్-ఫ్రీ వీడియోలను షూట్ చేయచ్చు. కంపెనీ గతంలో అందించిన సమాచారం ప్రకారం.. గెలాక్సీ M17 5G 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్ కోసం హ్యాండ్‌సెట్‌లో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంటుంది.

శామ్‌సంగ్‌ గెలాక్సీ M17 5G ధర..

శామ్‌సంగ్ గెలాక్సీ M17 5G అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్‌లో మూన్‌లైట్ సిల్వర్, సఫైర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను శుక్రవారం వెల్లడించనుంది. శాంసంగ్ గెలాక్సీ M17 5జీ స్మార్ట్‌ఫోన్‌లో దాని ముందున్న గెలాక్సీ M16 5జీ లాగానే 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ అందించారు. ఫోన్ 7.5 మి.మీ మందంగా ఉంటుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP54-రేటింగ్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ గూగుల్ సర్కిల్ టు సెర్చ్ , జెమిని లైవ్ ఫీచర్లకు మద్ధతిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ M17 5G చిప్‌సెట్, బ్యాటరీ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, లీక్‌ల ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌ 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లింక్ చేసిన ఎక్సినోస్ 1330 ప్రాసెసర్‌తో రానుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్‌ యూఐ 7పై రన్ అవుతుంది. అలానే 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad