Samsung Galaxy M36 5G Launched: ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ శామ్‌సంగ్ ఏం సిరీస్ లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ దీని శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G పేరిట మార్కెట్లోకి తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కొనాలనుకునేవారు దీని పరిశీలించవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.
ధర
శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 22,999 గా కంపెనీ పేర్కొంది. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ మొబైల్ ని కేవలం రూ.16,499 తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ.17,999గా, 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ.20,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఆరెంజ్ హెడ్జ్, సెరీన్ గ్రీన్, వెల్వెట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. జూలై 12 నుండి అమెజాన్, శామ్సంగ్ ఇండియా వెబ్‌సైట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులోకి రానుంది.
ఫీచర్లు
శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.7-అంగుళాల పూర్తి-HD + (1,080×2,340 పిక్సెల్స్) సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. కంపెనీ తన సొంత ప్రాసెసర్ అయిన Exynos 1380ను ఈ ఫోన్ లో అమర్చింది. దీని మందం 7.7mm. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ UI 7పై పనిచేస్తుంది. ఆరేళ్ల ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లు,ఆరేళ్ల భద్రతా నవీకరణలను పొందుతుందని కంపెనీ పేర్కొంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా యూనిట్ అందించారు. దీనికి 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, 12-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇక ముందు భాగంలో ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. కాగా వెనుక, ముందు కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి.
ఈ ఫోన్ ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇమేజ్ క్లిప్పర్, ఎడిట్ సూచనలు వంటి అనేక AI ఇమేజ్ ఎడిటింగ్ సాధనాలతో వస్తుంది. ఇది Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్, AI సెలెక్ట్‌ను కూడా కలిగి ఉంది. భద్రత కోసం నాక్స్ వాల్ట్ ఫీచర్ ఉంది. ఇక బ్యాటరీ గురుంచి మాట్లాడితే..శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G లో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Samsung Galaxy M36 5G: అదిరిపోయే ఫీచర్ల తో శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G..ధరెంతో తెలుసా..?
- Advertisement -