Discount: చాలా రోజులుగా ప్రీమియం శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనీ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నిర్వహిస్తోంది. ఈ రెండు సేల్స్ లో ఈ ఫ్లాగ్‌షిప్ శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ చాల చవక ధరకే కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే, చాలా మంది కస్టమర్లు ఈ పరికరాన్ని ఏ ప్లాట్‌ఫామ్ అతి తక్కువ ధరకు అందిస్తుందో అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ ఎందులో చవక ధరకు అందుబాటులో ఉందొ ఇక్కడ తెలుసుకుందాం.
శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్ ను ఎక్కడ కొనుగోలు చేయాలి?
ముందుగా, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో చూస్తే, ఈ పరికరం ధర రూ.88,990. కంపెనీ ఈ ఫోన్‌పై ప్రత్యేక బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే, ఈ పరికరాన్ని రూ.4,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో ఫోన్‌పై రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది.
మరోవైపు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో ఈ ఫోన్‌ను కేవలం రూ.73,999కే అందిస్తోంది. ఈ ఆఫర్ ఫోన్ పై గొప్ప తగ్గింపులా కనిపిస్తోంది. అయితే, ఈ డీల్‌లో ఏ బ్యాంక్ ఆఫర్‌లు లేవు. ఇదే ఫైనల్ రేట్. అమెజాన్ బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఇక్కడ అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.2,219 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇది మరింత ప్రత్యేకమైనది. అంటే అమెజాన్ ఈ ఫోన్‌ను గణనీయంగా తక్కువ ధరకు అందిస్తోంది.
శామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్: ఫీచర్లు
ఈ ఈ పరికరం ఫీచర్ల విషయానికి వస్తే, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో బిగ్ 6.8-అంగుళాల LTPO అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8వ జెన్ 3 ప్రాసెసర్ ను అమర్చారు. అడ్రినో 750 GPU కూడా ఉన్నాయి. ఫలితంగా దీనిలో సుదీర్ఘ గేమింగ్ సెషన్‌లను ఆస్వాదించవచ్చు. ఈ ఫోన్ కెమెరా మరింత ఆకట్టుకుంటుంది. 200MP ప్రైమరీ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 10MP టెలిఫోటో, 12MP అల్ట్రా-వైడ్ కెమెరాతో స్ఫుటమైన ఫోటోలు, వీడియోలను తీయడానికి వీలు కల్పిస్తుంది. సెల్ఫీల కోసం ఈ పరికరం 12MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ పరికరం 45W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి


