Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSamsung Galaxy S25 FE: సరసమైన ధరకే శామ్‌సంగ్ ప్రీమియం 5G ఫోన్..50MP కెమెరా, ఆకట్టుకునే...

Samsung Galaxy S25 FE: సరసమైన ధరకే శామ్‌సంగ్ ప్రీమియం 5G ఫోన్..50MP కెమెరా, ఆకట్టుకునే AI ఫీచర్లు..

Samsung Galaxy S25 FE SmartPhone: ప్రముఖ బ్రాండ్ శామ్‌సంగ్ ఇటీవల దాని సరసమైన ప్రీమియం 5G పరికరాన్ని లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కంపెనీ దీని శామ్‌సంగ్ గెలాక్సీ S25 FE పేరిట తీసుకొచ్చింది. ఈ ఫోన్ అమ్మకాలు ఇప్పటికే ఇండియాలో ప్రారంభమయ్యాయి. ఈ పరికరం ఎక్సినోస్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. కంపెనీ ఈ ఫోన్‌ను మూడు స్టోరేజ్ వేరియంట్‌లుతో మూడు కొత్త రంగు ఎంపికలలో పరిచయం చేసింది. ఈ పరికరం తాజా ఆండ్రాయిడ్ 16-ఆధారిత One UI 8 యూజర్ ఇంటర్‌ఫేస్‌పై నడుస్తుంది. ఇంకా, ఇది గూగుల్ సర్కిల్ టు సెర్చ్, జెమిని లైవ్ వంటి అనేక కృత్రిమ మేధస్సు ఫీచర్లకు కూడా మద్దతు ఇస్తుంది. దీని ఆఫర్ ధర, ఫీచర్ల వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

- Advertisement -

శామ్‌సంగ్ గెలాక్సీ S25 FE ధర:

ఈ పరికరం 8GBRAM+128GB స్టోరేజ్‌ వేరియంట్ రూ.59,999గా ఉండగా, 8GBRAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.65,999గా, 8GBRAM+512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.77,999గా ఉంది. ఇక ఆఫర్ విషయానికి వస్తే, డెబిట్, క్రెడిట్ కార్డులతో అదనంగా రూ.5,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ పరికరంపై 24 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలను కూడా కంపెనీ అందిస్తోంది.

also read:CMF Headphone Pro: ‘CMF హెడ్‌ఫోన్స్ ప్రో’ లాంఛ్..ఒకే ఛార్జ్‌పై 100 గంటల నాన్‌స్టాప్ మ్యూజిక్..

శామ్‌సంగ్ గెలాక్సీ S25 FE ఫీచర్లు:

స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే..ఈ పరికరం 6.7-అంగుళాల పూర్తి-HD+ డైనమిక్ అమోలేడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,900 nits వరకు గరిష్ట ప్రకాశాన్ని కూడా కలిగి ఉంది. ఈ పరికరం విజన్ బూస్టర్‌ను కూడా అందిస్తుంది. ఇది తాజా ఆండ్రాయిడ్ 16-ఆధారిత One UI 8పై రన్ అవుతుంది. పనితీరు కోసం ఈ ఫోన్ ఎక్సినోస్ 2400 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫోటోగ్రఫీ కోసం, పరికరం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, ఈ పరికరం 12-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇంకా, బ్యాటరీ విషయానికి వస్తే, ఈ పరికరం 4,900mAh బ్యాటరీ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ప్యాక్ చేస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad