Samsung Galaxy Tab A11: ప్రముఖ బ్రాండ్ శామ్సంగ్ తన కస్టమర్ల కోసం సరికొత్త టాబ్లెట్ ను భారతదేశ మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ దీని శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 పేరిట తీసుకొచ్చింది. అదిరిపోయే ఫీచర్లతో వస్తోన్న ఈ టాబ్లెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ ధరలో ఉండటం విశేషం. గెలాక్సీ Galaxy A సిరీస్‌లోని ఈ కొత్త టాబ్లెట్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో శక్తినిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 8.7-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. చాలారోజులుగా కొత్త టాబ్లెట్ కొనాలని చూస్తున్నవారికి వారికి ఇది ఉత్తమ ఎంపిక. దీని ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11: ధర
కంపెనీ శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 టాబ్లెట్ 4GBRAM+64GB స్టోరేజ్ వేరియంట్ (Wi-Fi మోడల్) ధర రూ.12,999గా పేర్కొంది. 8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గా, సెల్యులార్ వేరియంట్ ధర 4GB + 64GB మోడల్ రూ.15,999గా, 8GB + 128GB వేరియంట్ రూ.20,999గా నిర్ణయించింది. ఇది రెండు రంగుల ఎంపికలలో లభిస్తోంది. గ్రే, సిల్వర్ కలర్.
also read:Flipkart Sale: రూ.4,499కే సూపర్ ఫోన్..5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మరెన్నో..
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11: స్పెసిఫికేషన్లు
ఈ టాబ్లెట్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 8.7-అంగుళాల HD+ (800×1,340 పిక్సెల్స్) TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2.2GHz CPU వేగంతో ఆక్టా-కోర్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అయితే, శామ్సంగ్ అధికారికంగా ప్రాసెసర్ పేరును మాత్రం వెల్లడించలేదు. నిల్వ కోసం ఇది 8GB వరకు RAM,128GB నిల్వతో వస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు. ఇది ఆటోఫోకస్‌తో 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5-మెగాపిక్సెల్ ముందు కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే, శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A9, గెలాక్సీ ట్యాబ్ A9+ లాగా, గెలాక్సీ ట్యాబ్ A11 5,100mAh బ్యాటరీతో శక్తినిస్తుంది. దీని కొలతలు 211.0×124.7×8.0mm. దీని బరువు 337 గ్రాములు.కనెక్టివిటీ పరంగా..ఇందులో Wi-Fi, 5G, బ్లూటూత్ 5.3, GPS, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, QZSS, USB టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. దీనికి డాల్బీ-పవర్డ్ డ్యూయల్ స్పీకర్లు కూడా ఉన్నాయి.


