Samsung Galaxy Tab A11 Plus: ప్రముఖ బ్రాండ్ శామ్సంగ్ మార్కెట్లోకి సరికొత్త టాబ్లెట్ ను లాంచ్ చేసింది. కంపెనీ దీని శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 ప్లస్ పేరిట తీసుకొచ్చింది. ఈ టాబ్లెట్ ను మంగళవారం ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక గెలాక్సీ ట్యాబ్ A11తో పాటు విడుదల చేశారు. భారత మార్కెట్లో ఇటీవల దీని ప్రామాణిక గెలాక్సీ ట్యాబ్ A11 సైలెంట్ గా విడుదలైన విషయం తెలిసిందే. తయారీదారు ఈ ట్యాబ్ ను అతి తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో తీసుకొచ్చింది. 7,040mAh బిగ్ బ్యాటరీతో 25W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఎన్నో రోజుల నుంచి సరసమైన ధరకే కొత్త టాబ్లెట్ కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది ఉత్తమ ఎంపిక అవుతుంది.
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 ప్లస్ ధర:
శామ్సంగ్ ఫ్రాన్స్ ఒక న్యూస్‌రూమ్ పోస్ట్ ద్వారా శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 ప్లస్, శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 టాబ్లెట్ ప్రపంచ లాంచ్‌ను ప్రకటించింది. ఈ ఏడాది చివర్లో గెలాక్సీ ట్యాబ్ A11+ అమ్మకానికి అందుబాటులోకి వస్తుందని, ఇదే సమయంలో ధర కు ప్రకటించబడుతుందని కంపెనీ వెల్లడించింది. ఇది 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లలో గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది.
మరోవైపు శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 ఇప్పటికే భారతదేశంతో సహా అనేక మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ.12,999. అయితే సెల్యులార్ మోడల్ రూ.15,999 నుండి ప్రారంభమవుతుంది.
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 ప్లస్ ఫీచర్లు:
డిస్ప్లే
శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 ప్లస్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 11-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
ప్రాసెసర్
ప్రాసెసర్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా వివరాలను వెల్లడించలేదు. కాకపోతే శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 ప్రాసెసర్ ను పోలి ఉంటుందని సమాచారం.
ALSO READ:Realme Watch 5 Launched: ఆపిల్ వాచ్ అల్ట్రాను పోలి ఉండే రియల్‌మీ వాచ్ 5..14 రోజుల బ్యాటరీ లైఫ్..
సాఫ్ట్ వేర్
ఈ టాబ్లెట్ కంపెనీ One UI 8 ఇంటర్‌ఫేస్‌పై నడుస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారంగా, జెమిని ఇంటిగ్రేషన్‌ను కలిగి ఉంటుంది. ఇది ఏడు తరాల ఆపరేటింగ్ సిస్టమ్, భద్రతా నవీకరణలను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
స్టోరేజీ
ఈ ట్యాబ్ 256GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 2TB వరకు విస్తరించవచ్చు.
కెమెరా
కెమెరా విషయానికి వస్తే, ఇది సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం..5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. వెనుక కెమెరా గురించి ఎలాంటి వివరాలు ప్రకటించలేదు. టాబ్లెట్ డాల్బీ అట్మాస్ సౌండ్‌కు మద్దతు ఇస్తుంది. ఆడియో జాక్‌ను కూడా కలిగి ఉంది.
బ్యాటరీ
ఈ టాబ్లెట్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,040mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఇతర ఫీచర్లు
ఈ ఆండ్రాయిడ్ టాబ్లెట్ DeX మోడ్‌కు మద్దతు ఇస్తుంది. వినియోగదారులు దీనిని అనుకూలమైన మానిటర్ లేదా టీవీకి కనెక్ట్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు, కీబోర్డ్, మౌస్‌ను జోడించడానికి అలాగే PC-వంటి ఇంటర్‌ఫేస్‌తో మల్టీటాస్క్ చేయడానికి అనుమతిస్తుంది.


