Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSamsung Unpacked: సామ్సంగ్ ఫోల్డబుల్స్, వాచ్ 8 సిరీస్‌ అదుర్స్

Samsung Unpacked: సామ్సంగ్ ఫోల్డబుల్స్, వాచ్ 8 సిరీస్‌ అదుర్స్

Samsung Galaxy Unpacked 2025 : సామ్సంగ్ ఈవెంట్ మరోసారి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. న్యూయార్క్ లో జరిగిన సామ్సంగ్ గెలాక్సీ అన్ పాక్డ్ (Samsung Galaxy Unpacked) ఈవెంట్‌లో టెక్ ప్రియులకు కొత్త ఉత్పత్తులను కంపెనీ ఆవిష్కరించింది. కొత్త ప్రోడక్టుల్లో alaxy Z Fold 7, Galaxy Z Flip 7, Flip 7 FE ఫోల్డబుల్ ఫోన్లు ఉన్నాయి. వీటితో పాటు Galaxy Watch 8 సిరీస్ కూడా లాంచ్ చేశారు. ఈ ప్రోడక్ట్‌లు సామ్‌సంగ్ ఫోల్డబుల్ టెక్నాలజీలో చేస్తున్న అభివృద్ధికి నిదర్శనంగా నిలిచాయి.

- Advertisement -

గెలాక్సీ Z Fold 7 .. ఫోల్డబుల్ ఫోన్లలో కొత్త పరిణామం

సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 ప్రత్యేకతలు చాలా వున్నాయి. వాటిలో ముఖ్యంగా బిగ్ స్క్రీన్, అధునాతన కెమేరా వ్యవస్థ వంటివి చెప్పుకోవచ్చు. ఇది 7.6 అంగుళాల ఇంటర్నల్ ఫోల్డబుల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది, 120Hz రిఫ్రెష్ రేట్‌తో. కవర్ స్క్రీన్ కూడా 6.3 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తోంది. దీనిలో Snapdragon 8 Gen 4 ప్రాసెసర్‌ను అమర్చారు. దీంతో గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా స్పీడ్ ఉంటుంది. Fold 7 కెమేరా సెటప్ కూడా అద్భుతంగా ఉంది. 108MP ప్రధాన కెమేరా, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో లెన్స్‌తో 4x ఆప్టికల్ జూమ్ సపోర్ట్. 4800mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ పూర్తి రోజు సపోర్ట్ చేస్తుంది.

Z Flip 7 సిరీస్ విషయానికి వస్తే, ఇది 6.7 అంగుళాల AMOLED స్క్రీన్, తాజా ప్రాసెసర్, 64MP కెమేరా, 3700mAh బ్యాటరీతో వస్తోంది. ఫ్లిప్ 7 FE మోడల్ తక్కువ ధరతో, మధ్యతరగతి వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇవన్నీ 5G, Wi-Fi 7, Android 15 ఆధారిత OneUI 7 తో అందుబాటులో ఉంటాయి.

Galaxy Watch 8 సిరీస్

Galaxy Watch 8 సిరీస్ వినియోగదారుల ఆరోగ్య పర్యవేక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. 1.2 అంగుళాల మరియు 1.4 అంగుళాల AMOLED డిస్‌ప్లే, కొత్త BioActive సెన్సార్ ద్వారా హృదయ స్పందన, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయి, నిద్ర గమనిక వంటి ఫీచర్లను అందిస్తోంది. ఈ వాచ్ 100కి పైగా వర్క్‌ఔట్ మోడ్‌లను, శారీరక ఫిట్‌నెస్ ను ట్రాక్ చేయగలదు. 330mAh బ్యాటరీతో ఇది రెండు రోజుల వరకు సులభంగా పని చేయగలదు. Wear OS 5 ఆధారంగా పనిచేసే ఈ వాచ్ Google Maps, Assistant, మరియు Play Store యాప్స్‌ను మద్దతుగా కలిగి ఉంది.

ధరలు, మార్కెట్ విడుదల

Samsung Fold 7 భారత మార్కెట్లో రూ.1.79 లక్షల వద్ద, Flip 7 రూ.1.09 లక్షలు, Flip 7 FE రూ.79,999 వద్ద లభించనుంది. ఇక Watch 8 సిరీస్ రూ.29,999 ప్రారంభ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. భారత మార్కెట్లో ఆగస్ట్ 2025 నుండి అందుబాటులోకి వచ్చే వీటి బుకింగ్ లింకులు ఇప్పటికే Samsung ఇండియా వెబ్‌సైట్‌లో లైవ్ అయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad