Samsung Smartphones Under 7500: బడ్జెట్-ఫ్రెండ్లీ శామ్సంగ్ ఫోన్ కోసం కొనాలని చూస్తున్నారా?అయితే ఈ వార్త మీకోసమే! అమెజాన్ ఫ్రెట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కి ముందు రెండు శామ్సంగ్ స్మార్ట్ ఫోన్స్ పై గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అవి శామ్సంగ్ గెలాక్సీ M05, శామ్‌సంగ్ గెలాక్సీ M06 5G. ఈ రెండు శామ్‌సంగ్ ఫోన్లు కేవలం ధర రూ.7,500 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు ఈ పరికరాలను క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. అయితే, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా లభించే డిస్కౌంట్ పాత ఫోన్ కండీషన్, బ్రాండ్ పై ఆధారపడి ఉంటుంది.
Samsung Galaxy M05
అమెజాన్ ఇండియాలో శామ్సంగ్ గెలాక్సీ M05 స్మార్ట్ ఫోన్ 4GBRAM+ 64GB స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ.6,249 ధరకు అందుబాటులో ఉంది. దీన్ని రూ.312 వరకు క్యాష్‌బ్యాక్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఫోన్ ధరను రూ.5,900 వరకు తగ్గిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే, కంపెనీ ర్యామ్ ప్లస్ ఫీచర్‌తో 8GB వరకు ర్యామ్ ని అందిస్తోంది. ఇది 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్. ఇది 5000mAh బ్యాటరుతో, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OneUI కోర్ 6.0పై నడుస్తుంది.
Also Read:SmartPhones: రూ.10 వేల లోపు లభించే టాప్ 5G స్మార్ట్ ఫోన్లు.. లిస్ట్ ఇదే..
Samsung Galaxy M06 5G
శామ్‌సంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్ ఫోన్ 4GB RAM+ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అమెజాన్ ఇండియాలో రూ.7,499 ధరకు లభిస్తుంది. సేల్ సమయంలో ఈ పరికరంపై రూ.374 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఈ ధరను రూ.7,100 వరకు తగ్గిస్తుంది. ఫీచర్ల పరంగా ఇది HD+ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 800 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయిని సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్‌గా కంపెనీ ఫోన్‌లో డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్స్. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.


