Wednesday, January 21, 2026
Homeటెక్నాలజీSecond Hand Car: పాత కారు కొనాలనుకుంటున్నారా? ఈ ప్లాన్ మీకోసమే!

Second Hand Car: పాత కారు కొనాలనుకుంటున్నారా? ఈ ప్లాన్ మీకోసమే!

Essential Checks For Used Cars: సొంత కారు… ప్రతి ఒక్కరి కల. కుటుంబంతో కలిసి హాయిగా ప్రయాణాలు చేయాలని, అత్యవసరానికి అండగా నిలవాలని ఎందరో ఆశిస్తారు. కానీ కొత్త కారు కొనాలంటే బడ్జెట్ ఓ పెద్ద అడ్డంకి. అందుకే చాలామంది మధ్యతరగతి ప్రజల చూపు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మళ్లుతోంది. అయితే, పాత కారు కొనడం ఎంత తెలివైన నిర్ణయమో, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. కేవలం పైకి కనిపించే రంగు, మోడల్ చూసి మోసపోతే, కొన్న తర్వాత పరేషాన్ పడాల్సి వస్తుంది. మరి, సెకండ్ హ్యాండ్ కారు కొనేటప్పుడు ఎలాంటి విషయాలు క్షుణ్ణంగా పరిశీలించాలి..? మోసపోకుండా మంచి కారును ఎలా ఎంచుకోవాలి..? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేటప్పుడు, కేవలం ఇంజిన్ సౌండ్, కారు మోడల్, తయారైన సంవత్సరం చూస్తే సరిపోదు. సమగ్రంగా అనేక అంశాలను పరిశీలించాలి. అవేంటంటే…

బ్రాండ్, మోడల్ ఎంపిక: మొట్టమొదట మీరు ఏ బ్రాండ్, ఏ మోడల్ కారు కొనాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. మారుతి, హ్యుందాయ్, టయోటా వంటి కొన్ని బ్రాండ్లకు మార్కెట్‌లో మంచి రీసేల్ విలువ, విశ్వసనీయత ఉంటాయి.

ALSO READ: https://teluguprabha.net/technology-news/big-discount-on-apple-macbook-air-m2-on-amazon-india/

తయారీ సంవత్సరం (Manufacturing Year): సాధారణంగా, కారు తయారైన సంవత్సరం పాతదైన కొద్దీ దాని విలువ తగ్గుతుంది. అయితే, కేవలం తయారీ సంవత్సరం మాత్రమే కాకుండా, కారును గత యజమాని ఎలా ఉపయోగించారు, దాని ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలు కూడా విలువను ప్రభావితం చేస్తాయి. కావునా మరీ పాత మోడల్ కార్లు కాకుండా, 5-7 లోపు వయసున్న కారును ఎంచుకోవడం ఉత్తమం.

ఎన్ని కిలోమీటర్లు తిరిగింది (రీడింగ్):  ఇది చాలా ముఖ్యమైన అంశం. సాధారణంగా 50,000 నుండి 70,000 కిలోమీటర్ల లోపు తిరిగిన వాహనాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఎక్కువ దూరం ప్రయాణించిన కారు ఇంజిన్‌పై, ఇతర భాగాలపై ఎక్కువ ఒత్తిడి పడి ఉంటుంది, కాబట్టి మరమ్మతులు త్వరగా వచ్చే అవకాశం ఉంది.

సర్వీస్ హిస్టరీ : కారును క్రమం తప్పకుండా అధీకృత సర్వీస్ సెంటర్‌లో సర్వీసింగ్ చేయించారా లేదా అన్నది తప్పక తెలుసుకోవాలి. సర్వీస్ రికార్డులు కారు యొక్క ఆరోగ్యానికి నిదర్శనం. సరైన సర్వీస్ హిస్టరీ ఉన్న కారు ఎక్కువ నమ్మదగినదిగా ఉంటుంది.

ALSO READ:https://teluguprabha.net/technology-news/best-double-door-refrigerators-available-in-amazon-india/

ఇన్సూరెన్స్, క్లెయిమ్ హిస్టరీ: వాహనానికి చెల్లుబాటయ్యే ఇన్సూరెన్స్ ఉందా? లేదా? అనేది తనిఖీ చేయాలి. గతంలో ఏవైనా పెద్ద ప్రమాదాలకు గురై ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారేమో విచారించాలి. ‘నో క్లెయిమ్ బోనస్’ (NCB) కొనసాగుతుంటే, ఆ కారు పెద్దగా ప్రమాదాలకు గురి కాలేదని భావించవచ్చు.

ఫిజికల్ కండీషన్ : కారు బాడీపై ఎక్కడైనా డెంట్లు, తుప్పు పట్టడం లేదా రీ-పెయింటింగ్ చేసిన గుర్తులు ఉన్నాయేమో నిశితంగా గమనించాలి. టైర్లు, బ్రేకులు, ఇంజిన్ కండిషన్‌ను నిపుణులతో తనిఖీ చేయించడం అత్యవసరం.

పత్రాల పరిశీలన : ఇది అత్యంత కీలకమైన ఘట్టం. ఆర్సీ (Registration Certificate), ఇన్సూరెన్స్ పత్రాలు, పొల్యూషన్ సర్టిఫికెట్ సరిగ్గా ఉన్నాయో లేదో చూడాలి. ఒకవేళ కారును లోన్‌పై కొని ఉంటే, బ్యాంకు నుంచి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’ (NOC) ఉందో లేదో పక్కాగా నిర్ధారించుకోవాలి.

ALSO READ:https://teluguprabha.net/technology-news/hero-hf-deluxe-pro-bike-launched-in-india/

అదనపు మార్పులు (మోడిఫికేషన్స్): కొందరు కార్లకు ఖరీదైన స్టీరియో సిస్టమ్‌లు, అల్లాయ్ వీల్స్ వంటివి అదనంగా అమర్చుతారు. ఇవి కారు విలువను పెంచవచ్చు. కానీ, ఇంజిన్‌లో లేదా వాహనం నిర్మాణంలో చేసిన  మార్పులు దాని పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

రిజిస్ట్రేషన్ ప్రదేశం: మనం కొనే వాహనం ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిందో కూడా కారు ధరను ప్రభావితం చేయనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News