Saturday, November 15, 2025
Homeటెక్నాలజీAmazon Great Indian Festival Sale: ఈ మూడు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై కళ్ళు చెదిరే...

Amazon Great Indian Festival Sale: ఈ మూడు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై కళ్ళు చెదిరే ఆఫర్స్..డోంట్ మిస్..!

Smart Phones: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమెజాన్‌లో ప్రారంభమైంది. ఈ సేల్ ప్రైమ్ యూజర్ల కోసం ప్రత్యక్ష ప్రసారం. కావున ఈ సేల్ సమయంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే, వెంటనే కోనేయండి. ప్రైమ్ యూజర్ల కోసం ప్రత్యక్ష ప్రసారంలో ఉన్న ఈ సేల్ అన్ని శ్రేణులలోని స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప డీల్‌లను అందిస్తుంది. సరసమైన ధరకు కొత్త ఫోన్ కొనాలని చూస్తే, మూడు గొప్ప ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌ల ధర రూ.7,500 కంటే తక్కువగా ఉండటం విశేషం. ఈ జాబితాలో శామ్సంగ్, రియల్‌మీ, రెడిమి ఫోన్‌లు ఉన్నాయి. ఈ ఫోన్‌ల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

 

Realme Narzo 80 Lite 4G
ఈ ఫోన్ 4GBRAM+64GB ఇంటర్నల్ స్టోరేజ్ అమెజాన్‌ ఇండియాలో కేవలం రూ.7,298. ఈ ఫోన్‌పై రూ.1,000 కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ తో ఫోన్ ధర రూ.6,278 కు లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ పై రూ.364 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ 6300mAh బ్యాటరీ ని కలిగి ఉంది. ఫోన్ మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో వస్తుంది.

Samsung Galaxy M06 5G
అమెజాన్ ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ M06 5G స్మార్ట్ ఫోన్ 4GBRAM+64GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర ఋ.7,499. ఈ ఫోన్‌ను సేల్ సమయంలో రూ.374 వరకు క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌పై గణనీయమైన ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా వచ్చే అదనపు డిస్కౌంట్ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. కంపెనీ ఫోన్‌లో ప్రాసెసర్‌గా డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ HD+ డిస్ప్లేతో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం మీకు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా లభిస్తుంది. ఫోన్ బ్యాటరీ 5000mAh.

Redmi A4 5G
4GBRAM+64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర అమెజాన్ ఇండియాలో రూ.7,499. ఈ ఫోన్‌ను రూ.374 వరకు క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, ఇది 6.88-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించారు. కంపెనీ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 4s జెన్ 2 ప్రాసెసర్‌ను అందిస్తోంది. 5160mAh బ్యాటరీతో 18W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad