Sunday, September 8, 2024
Homeటెక్ ప్లస్Social media down: ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాలు డౌన్.. అల్లాడుతున్న యూజర్స్

Social media down: ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాలు డౌన్.. అల్లాడుతున్న యూజర్స్

సోషల్ మీడియా డౌన్ కావటంతో ప్రపంచవ్యాప్తంగా యూజర్స్ ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. గత రెండు రోజులుగా జీమెయిల్ మొరాయించి సతాయించగా తాజాగా ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టా వంటి సోషల్ మీడియా సైట్లు డౌన్ అయిపోయాయి. దీంతో తమ డే టు డే బిజినెస్ ను చేసుకోలేక ఒకవైపు ఉద్యోగులు మరోవైపు వ్యాపారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. అయితే ఈ సమస్య అత్యధికంగా అమెరికన్లు ఎదుర్కొంటున్నారు. అయితే సమస్య తమకు తెలుసనని, దాన్ని పరిష్కరించే పనుల్లో తలమునకలై ఉన్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. అక్టోబర్ లో ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుంచీ ఇలాంటి బగ్స్ ట్విట్టర్ ను కుదిపేస్తున్నాయి. మెటా ప్లాట్ ఫార్మ్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ ది కూడా సేమ్ పరిస్థితి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News