మీరు ఎక్కడికి వెళ్లినా చేతిలో డబ్బు లేకుండా డిజిటల్ పేమెంట్స్ చేస్తారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. ఫిబ్రవరి 1, 2025 నుంచి కొందరి UPI ట్రాన్సాక్షన్స్ అవ్వవు.. UPIతో సంబంధించిన కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ నిబంధనలు ప్రకారం ప్రత్యేక అక్షరాలు (Special Characters) ఉన్న UPI ఐడీలతో లావాదేవీలు చేయడం ఇకపై సాధ్యం కాదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది.
UPI అనేది భారతదేశం సహా అనేక దేశాల్లో ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించే ప్రధాన మార్గంగా మారింది. నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు UPI ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపుల పెరుగుదల నేపథ్యంలో, ప్రభుత్వాలు కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా, NPCI కొత్త నిబంధనలను ప్రకటించింది.
కొత్త UPI నిబంధనలు: ఫిబ్రవరి 1, 2025 నుంచి అమలులోకి వచ్చే ఈ నిబంధనల ప్రకారం, కేవలం ఆల్ఫాన్యూమెరిక్ అక్షరాలు (A-Z, a-z) సంఖ్యలు (0-9) మాత్రమే UPI ఐడీలలో ఉండాలి. అయితే @, #, %, $ వంటి ప్రత్యేక అక్షరాలు ఉన్న UPI ఐడీలతో లావాదేవీలు చేయడం ఇకపై వీలుకాదు. ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఐడీలతో మాత్రమే UPI ద్వారా లావాదేవీలు జరగవచ్చు.
NPCI ఈ చర్య ఎందుకు తీసుకుంది?
UPI లావాదేవీలను మరింత మెరుగుపరచడం, భద్రతను పెంచడం వినియోగదారుల ఆర్ధిక లావాదేవీలను మరింత సులభతరం చేయడమే NPCI ఈ నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన కారణం. కొన్ని బ్యాంకులు, యాప్లు ఈ నిబంధనలను అనుసరించకుండా ప్రత్యేక అక్షరాలతో UPI ఐడీలు రూపొందించాయి. దీంతో NPCI కఠిన చర్యలు తీసుకుంటూ, ఈ ఐడీలను బ్లాక్ చేయాలని నిర్ణయించింది.
ఫిబ్రవరి 1 నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయి. అందువల్ల, మీ UPI ఐడీ ప్రస్తుతం ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉందో లేదో చెక్ చేసుకోవడం తప్పనిసరిగా మారింది.