Sunday, November 16, 2025
Homeటెక్నాలజీElectric Vehicles: మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. ఇది చేయండి, డిమాండ్ ఎక్కువ

Electric Vehicles: మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా.. ఇది చేయండి, డిమాండ్ ఎక్కువ

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టడం ఒక గొప్ప వ్యాపార అవకాశంగా మారింది. టాటా, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీలు ఈ రంగంలో మరింత దృష్టి సారిస్తున్నాయి, అలాగే ఎలాన్ మస్క్ టెస్లా కూడా భారతదేశంలో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితులు చూస్తే, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెట్టడం మంచి ఆదాయం అందించవచ్చు.

- Advertisement -

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు కనీసం నాలుగు లేదా ఐదు వాహనాలు పార్క్ చేయగల స్థలం అవసరం. రోడ్డు పక్కన ఉన్న స్థలం ఈ స్టేషన్ పెట్టడానికి మంచి ఎంపిక అవుతుంది. మీరు ఒక ఛార్జింగ్ పాయింట్ లేదా నాలుగు ఐదు ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయవచ్చు. ఈ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు కావాలి. ప్రాపర్టీ పేపర్, లీజ్ అండ్ రెంట్ పేపర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, GST నంబర్, బ్యాంక్ అకౌంట్ వంటి ఆధారాలు అవసరం.

ఈవీ ఛార్జింగ్ స్టేషన్ స్థాపించడానికి టాటా పవర్, ఛార్జ్+జోన్ వంటి సంస్థలు వివిధ పథకాలు అందిస్తున్నాయి. మొత్తం ఖర్చు సుమారు 10 లక్షల రూపాయల వరకు అవుతుంది. అయితే, టూ-వీలర్ లేదా ఈ-రిక్షా ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే, 50 వేల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కరెంట్ బిల్లు వేరుగా ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా ఆదాయం యూనిట్ లెక్కన వస్తుంది. ఖర్చులు పోగొట్టి రోజుకు సుమారు 2 వేల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad