Sunday, September 8, 2024
Homeటెక్ ప్లస్Startups in Schools: స్కూళ్లలో స్టార్టప్స్ సంస్కృతి

Startups in Schools: స్కూళ్లలో స్టార్టప్స్ సంస్కృతి

స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో వైవిధ్యం, సమగ్రతను ప్రోత్సహించడానికి, మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడానికి FLO మరియు T-Hub అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.  స్టార్టప్ కల్చర్ ను పాఠశాలలు విస్తరించాలని యోచిస్తోంది తెలంగాణ సర్కారు. ఎఫ్‌ఎల్‌ఓ (ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో టి-హబ్‌లో జరిగిన “పవర్ ఆఫ్ పార్టనర్‌షిప్” కార్యక్రమంలో పాఠశాలల్లో స్టార్టప్ సంస్కృతిని ఎలా ప్రారంభించాలి లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంస్కృతిని పిల్లల్లో ఎలా పెంపొందించాలి అని విద్యావేత్త శ్రీమతి ధన్య అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

- Advertisement -

20 రోజుల క్రితమే తాము వై-హబ్‌ని సృష్టించినట్టు, అపూర్వ వై-హబ్ కు  సీఈవోగా దాని వ్యవహారాలు చూస్తున్నారని ఆయన తెలియజేశారు.  వై-హబ్‌లో పాఠశాలలు నమోదు చేసుకోవాలన్నారు.  ఇందులో భాగంగా అవసరమైన ట్రైనింగ్ కోసం టీచర్స్ ను ట్రైనింగ్ కోసం పంపాలని తెలిపారు.

ఈ సందర్భంగా, FLO, T-Hubతో MOU (మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్) కుదుర్చుకుంది. FLO తరపున శ్రీమతి రీతు షా,T-Hub తరపున T-Hub ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ Mr శ్రీనివాసరావు మహంకాళి సంతకం చేసారు. శ్రీమతి రీతు షా మోడరేట్ చేసిన చర్చలో ప్యానలిస్టులుగా ఉన్న WE-హబ్ చీఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్, శ్రీ జయేష్ రంజన్ మరియు శ్రీమతి దీప్తి రావుల సమక్షంలో వారు అవగాహనా పత్రాలను మార్చుకున్నారు.

ఈ ఎమ్ఒయు FLO సభ్యులకు విలువ ఆధారిత వృత్తిపరమైన మద్దతు, మార్గదర్శకత్వంతో సహాయం చేస్తుందని రీతూ షా ప్రకటించారు. తెలంగాణలో మహిళా పారిశ్రామికవేత్తలకు వనరులు, మార్గదర్శకత్వం మరియు నిధుల అవకాశాలను సులభతరం చేస్తుంది. మహిళల్లో ఆవిష్కరణ, వ్యవస్థాపకతను ప్రోత్సహించే మరింత సమానమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం దీని లక్ష్యమని నిర్వాహకులు వివరించారు.

FLO & T-Hub Panel చర్చలో ప్యానెలిస్ట్‌లలో ఒకరైన జయేష్ రంజన్, “ఉమెన్ ఎంపవరింగ్: ది FLO హైదరాబాద్, వైవిధ్యం కోసం T-హబ్ పార్టనర్‌షిప్” అనే అంశంపై సాంకేతికత ఇంకా నగరంలోని మంచి స్కూళ్లల్లోకి రాలేదన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News