Zomato Deepinder Goyal Temple Equipment: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నప్పుడు ఆయన ఎడమ కన్ను పక్కగా ధరించిన ఓ పరికరం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఆ గ్యాడ్జెట్ ఏంటి.? అదెలా పనిచేస్తుందనే అంశం చాలా మందిలో ఆసక్తిని రేకెత్తించింది. దీని గురించి దీపిందర్ ఓ విషయం చెప్పారు.. అదేంటో చూద్దాం..
సాధారణంగా బీపీని కొలవడానికి మెషీన్లు ఉంటాయి. హార్ట్‌బీట్‌ని, మన నడకను పర్యవేక్షించడానికి స్మార్ట్ పరికరాలు వచ్చాయి. అయితే మెదడుకి చేరే రక్త ప్రవాహాన్ని పర్వవేక్షించడానికి కూడా ఓ పరికరం ఉంటుందని మీకు తెలుసా.. అదే జొమాటో సీఈఓ ధరించిన స్టిక్కర్.. ‘గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్’ అనే ఆలోచన నుంచి ఈ పరికరం వచ్చిందని దీపిందర్ చెప్పారు. తన కోసం ఒక ఫిట్‌నెట్ టీంను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపిన గోయల్.. తన మెదడుకి రక్తప్రవాహాన్ని పర్యవేక్షించాలని అనుకున్నట్లు వారికి చెప్పినట్లు పేర్కొన్నారు.
బ్రెయిన్ ఫ్లో మానిటర్
ఇందుకోసమే ఒక పరికరాన్ని అభివృద్ది చేయించామని.. ఇది ప్రస్తుతం థర్డ్ పార్టీ వద్ద ధ్రువీకరణ దశలో ఉందని గోయల్ ఉన్నారు. ఇంతకుముందు ఈ పరికరం పెద్దగా ఉండేదని.. ఇప్పుడు చిన్నదిగా మార్చి మరింత మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌ల మాదిరిగా కాకుండా దీపిందర్ గోయల్ ఈ పరికరాన్ని ఎడమ కన్నుకు పక్కగా ధరించడంతో రక్త ప్రవాహంలో మార్పులను నిరంతరం ట్రాక్ చేస్తుందట. మున్ముందు మెదడు పనితీరు గురించి ఈ ‘బ్రెయిన్ ఫ్లో మానిటర్’ సమాచారాన్ని అందిస్తుందట.
Also Read: https://teluguprabha.net/lifestyle/the-best-indian-city-for-women-is-bengaluru-2025-survey-says/
టెంపుల్‌తో బిహేవియర్‌లో మార్పులు
ఈ పరికరానికి ‘టెంపుల్’ అని పేరు పెట్టినట్లు దీపిందర్ తెలిపారు. సుమారు ఏడాది పాటు ‘టెంపుల్’ పైన ప్రయోగం సాగిందని.. వందలాది ఎంఆర్ఐ, డాప్లర్ స్కాన్ ఫలితాలతో పోల్చి చూసినట్లు చెప్పారు. ఈ పరికరం ద్వారా మీరు ప్రవర్తించే విధానంలోనూ మార్పులు ఉంటాయని అంటున్నారు.
ఈ ‘టెంపుల్’ పరికరంపై సీఎంపీ లూధియానా న్యూరాలజీ ప్రొఫెసర్ డా. జయరాజ్ డి. పాండియన్ తన అభిప్రాయం చెప్పారు. ఇది ఒక ఫ్లో సెన్సార్ అని గతంలో శారీరక శ్రమను కొలవడానికి యాక్టిగ్రఫీ (నిద్రలో ఒక వ్యక్తి శారీరక శ్రమను పర్యవేక్షించడానికి వాడే సెన్సార్) వంటి పరికరాలు ఉపయోగించారన్నారు. కానీ, ఇలా ధరించే పరికరం నేరుగా మెదడు రక్త ప్రవాహాన్ని కొలవదని పాండియన్ చెబుతున్నారు. మెదడు రక్త ప్రవాహాన్ని కొలవడానికి ఎంఆర్ యాంజియోగ్రఫీ, ఎంఆర్ఐ, పీఈటీ స్కాన్, లాంటి అనేక ఇతర పద్ధతులున్నాయని.. కొన్ని మెదడు వ్యాధులను నిర్ధారించడానికి ట్రాన్స్‌క్రానియల్ డాప్లర్ అల్ట్రాసౌండ్ నిర్వహిస్తాయని వివరించారు.
వైద్యుల సలహా అవసరం
అయితే మెదడు పనితీరును అర్థం చేసుకోవడానికి టెంపుల్ పరికరం లాంటి పద్ధతులు పూర్తిగా ధ్రువీకరణ లేదని డాక్టర్ పాండియన్ అంటున్నారు. అయితే గ్రావిటీ ఏజింగ్ హైపాథసెస్ ఒక కొత్త పరికల్పన అని డాక్టర్ పాండియన్ విశ్వాసం వ్యక్తం చేశారు. మెదడుకి రక్త ప్రవాహాన్ని వైద్య సలహా ప్రకారమే కొలవాలని ఆయన సూచిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/delhi-turkman-gate-violence-arrests-demolition-rumor/
అయితే ఈ హైపాథసెస్ సరైనదా, కాదా అనే విషయం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఈ చర్చలు మెదడు, వృద్ధాప్యం, అనేక ఇతర సమస్యలను మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని మరోవైపు దీపిందర్ గోయల్ అంటున్నారు. విమర్శకులకు తమ అభిప్రాయాలను పంచుకునే స్వేచ్ఛ ఉందని.. ఇక్కడ దాచడానికి ఏమీ లేదని చెబుతున్నారు.

