Tata Harrier EV Stealth Edition Launched: భారత మార్కెట్లో అనేక ఎలక్ట్రిక్ వాహనాలను అందించే ప్రముఖ వాహన తయారీదారు టాటా మోటార్స్ తన టాటా హారియర్ EV స్టెల్త్ ఎడిషన్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఎడిషన్ రియర్ వీల్ డ్రైవ్, క్వాడ్ వీల్ డ్రైవ్ అనే రెండు ఎంపికలలో వస్తోంది. అయితే ఈ కారు కు సంబంధించి ధర, ఫీచర్ల గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.
టాటా హారియర్ EV స్టెల్త్ ఎడిషన్ ఎడిషన్ మొత్తం నాలుగు వేరియంట్లను అందుబాటులోకి వచ్చింది. వీటిలో రెండు రియర్ వీల్ డ్రైవ్, రెండు క్వాడ్ వీల్ డ్రైవ్ టెక్నాలజీతో వచ్చాయి. వాటిలో ఎంపవర్డ్ 75 స్టీల్త్, ఎంపవర్డ్ 75 స్టీల్త్ ACFC, ఎంపవర్డ్ QWD 75 స్టీల్త్, ఎంపవర్డ్ QWD 75 స్టీల్త్ ACFC.
టాటా హారియర్ EV స్టీల్త్ ఎడిషన్‌లో అనేక గొప్ప ఫీచర్లను అందించారు. ఇందులో బూస్ట్ మోడ్, ఆఫ్ రోడ్ అసిస్ట్, నార్మల్, స్నో, గ్రాస్, మడ్, ఇసుక, రాక్, కస్టమ్ టెర్రైన్ మోడ్‌లు, మాట్టే స్టీల్త్ బ్లాక్ పెయింట్ స్కీమ్, కార్బన్ లెథరెట్ సీట్లు, ఇంటీరియర్, 19 అంగుళాల పియానో బ్లాక్ అల్లాయ్ వీల్స్ తీసుకొచ్చారు.
అలాగే, ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, యాంబియంట్ లైట్, ఆటో పార్క్ అసిస్ట్, లెవల్-2 ADAS, 540 డిగ్రీ వ్యూ కెమెరా, 36.9 సెం.మీ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్డ్ టెయిల్‌గేట్, JBL 10 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
టాటా హారియర్ EVని 75 KWh బ్యాటరీతో వస్తోంది. ఇది SUVకి ఒకే ఛార్జ్‌లో 627 కి.మీ MIDC పరిధిని ఇస్తుంది. దీనిలో అందించిన PMSM మోటార్ 238 PS శక్తిని, 315 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.
టాటా హారియర్ EV స్టెల్త్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 28.24 లక్షల నుండి ప్రారంభవుతుంది. ఇక ఈ కారు టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 30.23 లక్షల వరకు ఉంటుంది. టాటా హారియర్ EV మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌తో నేరుగా పోటీపడుతుంది.