Sunday, November 16, 2025
Homeటెక్నాలజీTCL C72K QD Mini‑LED: భారత్ మార్కెట్లో TCL నయా టీవీ.. అదిరిపోయిన ఫీచర్లు..

TCL C72K QD Mini‑LED: భారత్ మార్కెట్లో TCL నయా టీవీ.. అదిరిపోయిన ఫీచర్లు..

TCL C72K QD Mini‑LED Launched: TCL తన కొత్త C72K QD మినీ-LED స్మార్ట్ టీవీని భారతదేశ మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ టీవీని ఐదు సైజుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో 55 అంగుళాల నుండి 98 అంగుళాల వరకు స్క్రీన్ సైజు ఎంపికలు ఉన్నాయి.ఇది 4K రిజల్యూషన్‌తో 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. TCL ఇన్-హౌస్ AiPQ ప్రో ప్రాసెసర్‌పై వస్తోన్న ఈ టీవీ ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

TCL C72K QD Mini‑LED టీవీ ధర:

TCL C72K QD మినీ-LED టీవీ 55-అంగుళాల వేరియంట్ ధర రూ.84,990గా నిర్ణయించారు. ఇక 65-అంగుళాల, 75-అంగుళాల, 85-అంగుళాల, 98-అంగుళాల వేరియంట్‌ల ధరల గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ టీవీని అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, ఇతర ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనుగోలు చేయొచ్చు. అయితే, ఫ్లిప్‌కార్ట్ 65-అంగుళాల వేరియంట్‌ను రూ.99,990గా, 75-అంగుళాల వేరియంట్‌ను రూ.1,59,990 ధరకు జాబితా చేసింది.

Also Read: iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ పై బిగ్ అప్‌డేట్.. లాంచ్ తేదీ, ఫీచర్లు ఇలా..

TCL C72K QD Mini‑LED ఫీచర్లు:

TCL C72K QD మినీ-LED టీవీ 55-అంగుళాలు, 65-అంగుళాలు, 75-అంగుళాలు, 85-అంగుళాలు మరియు 98-అంగుళాలలో అందుబాటులో ఉంది. దీనికి 4K (3,840 x 2,160 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 178-డిగ్రీల వీక్షణ కోణం, 2600 నిట్‌ల వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందించారు. ఇది 2,048 లోకల్ డిమ్మింగ్ జోన్‌లను అందించే QD-Mini LED టెక్నాలజీతో HVA ప్యానెల్‌ను కలిగి ఉంది. ఇందులో కంపెనీ ఆల్-డొమైన్ హాలో కంట్రోల్ సిస్టమ్‌ను ఉపయోగించింది. ప్యానెల్ డాల్బీ విజన్, HDR10+ కు మద్దతు ఇస్తుంది. ఇది మెటాలిక్ బాడీతో వస్తుంది. ఇక గేమింగ్ కోసం..వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (VRR) కు సపోర్ట్ చేస్తుంది.

ఈ టీవీ Google TV OS పై పనిచేస్తుంది. మెరుగైన గేమింగ్ అనుభూతి కోసం గేమ్ మాస్టర్ మోడ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
కస్టమర్లు స్మార్ట్ టీవీని హ్యాండ్స్-ఫ్రీగా నియంత్రించడానికి అంతర్నిర్మిత Google అసిస్టెంట్‌ను ఉపయోగించవచ్చు. ఇది కంపెనీ అంతర్గత AiPQ ప్రో ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది కంటెంట్‌ను విశ్లేషించడం, చిత్రాలను ఆప్టిమైజ్ చేయడం ద్వారా దృశ్య అనుభవాన్ని మెరుగుపరుస్తుందని కంపెనీ తెలిపింది. కాగా ఈ టీవీ 3GB RAM, 64GB నిల్వను కలిగి ఉంది.

Also Read: Itel Alpha Smart watches: మార్కెట్లో ఐటెల్ ఆల్ఫా స్మార్ట్‌వాచ్‌లు విడుదల.. ధర కూడా తక్కువే!

OTT ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్

ఈ కొత్త స్మార్ట్ టీవీలో డాల్బీ అట్మోస్ DTSVirtual:X కి మద్దతు ఇచ్చే Onkyo 2.0 హై-ఫై ఆడియో సెటప్ ను కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5, జియో సినిమా, వూట్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేస్తుంది. కనెక్టివిటీ పరంగా..బ్లూటూత్ 5.4, AirPlay 2, Wi-Fi వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి నాలుగు HDMI పోర్ట్‌లు, ఒక USB పోర్ట్, ఆప్టికల్ ఆడియో అవుట్‌పుట్, ఈథర్నెట్ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. దీనికి క్రోమ్‌కాస్ట్ మద్దతు కూడా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad