Tecno Pop X Launched: భారత్ మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్ కొనాలనుకునే వారికి మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. టెక్నో సంస్థ తన తాజా ఫోన్ టెక్నో పాప్ X ను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలో ఉపయోగకరమైన ఫీచర్లు అందించాలనే లక్ష్యంతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ముఖ్యంగా పెద్ద డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, పెద్ద బ్యాటరీ వంటి అంశాలతో ఈ ఫోన్ వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా కనిపిస్తోంది.
పెద్ద డిస్‌ప్లే.. 120Hz రిఫ్రెష్ రేట్: డిస్‌ప్లే విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల HD+ LCD స్క్రీన్ అందించారు. 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఈ స్క్రీన్ పనిచేస్తుంది. ముఖ్యంగా 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, వీడియోలు చూసే సమయంలో స్మూత్ అనుభవం లభిస్తుంది. ఈ స్క్రీన్ పిక్సెల్ డెన్సిటీ 260ppi గా ఉంటుంది.
ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్: పర్‌ఫార్మెన్స్ కోసం ఈ ఫోన్‌లో యూనిసోక్ T7250 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 12nm టెక్నాలజీతో రూపొందించబడింది. ఫోన్‌లో 4GB LPDDR4x రామ్, 64GB eMMC స్టోరేజ్ అందించారు. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా పనిచేస్తుంది. దీనిపై కంపెనీ HiOS 15 యూజర్ ఇంటర్‌ఫేస్ అందించింది.
Read Also: Skin care tip: మెరిసే చర్మం కోసం 5 సూత్రాలు.. మారుతున్న వాతావరణానికి తగ్గట్టుగా ఇలా చేయండి
కెమెరా ఫీచర్లు: కెమెరా విషయానికి వస్తే వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా మాడ్యూల్ లాగా కనిపించినా వాస్తవానికి ఒకే 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంటుంది. దీనికి f/1.85 అపర్చర్ ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. అలాగే ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ ఉంది. అంటే ధూళి, నీటి చినుకుల నుంచి కొంత రక్షణ ఉంటుంది.
బ్యాటరీ, కనెక్టివిటీ: బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ అందించారు. ఇది 15W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే బాక్స్‌లో 10W ఛార్జర్ ఇస్తున్నారు. అలాగే సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4G LTE, వైఫై, బ్లూటూత్ 5.2, GPS, USB టైప్-C కనెక్టివిటీ ఉన్నాయి. అదనంగా IR ట్రాన్స్‌మిటర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఈ ఫోన్‌లో ఇచ్చారు. ఈ ఫోన్ బరువు 182.6 గ్రాములు ఉండగా మందం 8.18mm గా ఉంది.
ధర ఎంతంటే: ధర విషయానికి వస్తే ఈ ఫోన్ భారత మార్కెట్‌లో రూ.8,499 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 4GB రామ్, 64GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఉంది. చిల్లీ గ్రీన్, ఫ్లేర్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మార్చి 6 నుండి అమెజాన్ సహా ఇతర రిటైల్ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభం అవుతాయి. ప్రారంభ ఆఫర్‌లో HDFC బ్యాంక్ కార్డ్ ఉపయోగిస్తే ధర రూ.7,749 వరకు తగ్గే అవకాశం ఉంది.

