Tecno Pova 7 5G Series Launched: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ టెక్నో తన తాజా పోవా 7 5G సిరీస్‌ను భారతదేశంలో అధికారికంగా రిలీజ్ చేసింది. ఈ కొత్త సిరీస్‌లో Tecno Pova 7 Pro 5G, Tecno Pova 7 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. అయితే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు రూ. 20 వేల కంటే తక్కువ ధరలో ఉన్నాయి. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 6000mAh బిగ్ బ్యాటరీ, 256GB వరకు నిల్వతో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు జూలై 10 నుండి ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Tecno Pova 7 Pro 5G ధర, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్ 8GB RAM+128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 12,999గా కంపెనీ పేర్కొంది. ఇక 8GB RAM+ 256 GB నిల్వ వేరియంట్ రూ. 13,999గా నిర్ణయించింది. కాగా, ఈ ఫోన్ మ్యాజిక్ సిల్వర్, గ్రీన్, గీక్ బ్లాక్ రంగులలో వస్తుంది.
టెక్నో పోవా 7 ప్రో 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్లు చూస్తే.. ఈ పరికరం 144 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల (1224 x 2720 పిక్సెల్స్) 1.5K AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. స్క్రీన్ 4500 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ లో డిస్ప్లే రక్షణ కోసం.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తీసుకొచ్చారు. ఈ పరికరంలో 2.5 GHz వరకు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ 4nm ప్రాసెసర్, మాలి-G615 MC2 GPUని అమర్చారు. టెక్నో పోవా 7 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 128GB, 256GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్‌తో 8GB వరకు RAM ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 తో పనిచేస్తుంది.
ఇక కెమెరా గురించి మాట్లాడితే..ఈ స్మార్ట్‌ఫోన్ F/1.7 అపెర్చర్‌తో 64MP ప్రైమరీ సోనీ IMX682 సెన్సార్, F/2.2 అపెర్చర్‌తో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా 4K 30fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం F/2.2 అపెర్చర్‌తో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కెమెరా 4K 30fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.
ఈ పరికరంలో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6000mAh బ్యాటరీని అందించారు. ఈ ఫోన్ 30W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. టెక్నో పోవా 7 ప్రో 5Gలో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, IR సెన్సార్, స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, డాల్బీ అట్మాస్ ఫీచర్లు ఉన్నాయి. పరికరం కొలతలు 163.47×75.87×8.15mm. బరువు 195 గ్రాములు. కనెక్టివిటీ కోసం.. ఇందులో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 AC, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.
Tecno Pova 7 5G ధర, ఫీచర్లు
టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM+128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999గా, 8GB RAM+ 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 17,999 గా కంపెనీ పేర్కొంది. ఈ మొబైల్ డైనమిక్ గ్రే, నియాన్ సియాన్, గీక్ బ్లాక్ రంగులలో లభిస్తుంది.
టెక్నో పోవా 7 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్లు చూస్తే..ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల (2460×1080 పిక్సెల్స్) ఫుల్‌హెచ్‌డి+ ఫ్లాట్ ఎల్‌సిడి స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 2.5GHz ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ 4nm ప్రాసెసర్, మాలి-G615 MC2 GPU ని కలిగి ఉంది. టెక్నో పోవా 7 5G పరికరం 8GB RAM తో 128GB/256GB స్టోరేజ్ వేరియంట్ ను కలిగి ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించవచ్చు. ఫోన్ హైబ్రిడ్ డ్యూయల్ సిమ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HiOS 15 పనిచేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. టెక్నో పోవా 7 5G స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ రియర్ కెమెరా అపర్చర్ F/1.6, సెకండరీ సెన్సార్‌తో వస్తుంది. ఇది 4K 30fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. హ్యాండ్‌సెట్ F/2.2 తో ఎపర్చర్‌తో 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ మొబైల్ లో 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6000mAh బిగ్ బ్యాటరీ అందించారు. స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR సెన్సార్ ఉన్నాయి. ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్నాయి. ఈ పరికరం కొలతలు 167.25×75.61×8.8mm. బరువు 207 గ్రాములు. కనెక్టివిటీ కోసం.. ఇందులో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 AC, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.