Friday, November 22, 2024
Homeటెక్ ప్లస్Teenagers: సోషల్ మీడియాను వదల లేకపోతున్న టీన్స్..

Teenagers: సోషల్ మీడియాను వదల లేకపోతున్న టీన్స్..

అమెరికాలో టీనేజ్ ఇంటర్ నెట్ యూజర్లు ఎక్కువయ్యారు. వీరిలో అబ్బాయిల సంఖ్య కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని అక్కడి సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఫేస్ బుక్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికలకు అమ్మాయిలు బాగా అలవాటు పడ్డారని, వాటిని వదలడం కష్టమని భావిస్తున్నారని అమెరికాలోని పీ రీసెర్చ్ సెంటర్ సర్వేలో తేలింది. సర్వే చేసిన వారిలో 54 శాతం మంది సోషల్ మీడియాను వదిలి పెట్టడం కష్టమని అభిప్రాయపడితే, 46 శాతం మంది కొంతమేర సులువేనని అన్నారు. టీనేజ్ అబ్బాయిల్లో 49 శాతం మంది ఇంటర్నెట్ వదలడం కష్టమని భావిస్తే, 59 శాతం మంది అమ్మాయిలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.

- Advertisement -

15 నుంచి 17 సంవత్సరాల వయసున్న టీన్స్ లో ప్రతి పది మందిలో ఆరు మంది సోషల్ మీడియాను వదలడం కష్టమేననే ఫీలింగుతో ఉన్నారు. 13 , 14 ఏళ్ల టీన్స్ అయితే చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. 36శాతం టీన్స్ తాము గంటల కొద్దీ సోషల్ మీడియాలో గడుపుతున్నామని చెప్పారు. ఆన్ లైన్ సోషల్ మీడియా వేదికలే కాకుండా డిజిటల్ డివైజెస్ మీద కూడా టీన్స్ ఎక్కువ సమయం గడుపుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. స్మార్ట్ ఫోన్లు 95 శాతం,లాప్ టాప్, డెస్క్ టాప్ కంప్యూటర్లు 90 శాతం మందికి అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ వంటి వాటితో 80 శాతం మంది గడుపుతున్నారు. నిత్యం ఇంటర్నెట్ ని వినియోగిస్తున్న టీనేజర్స్ ప్రస్తుతం 97 శాతానికి పెరిగారు.

గత ఎనిమిదేళ్లలో టీన్స్ లో స్మార్ట్ ఫోన్ వినియోగం బాగా ఎక్కువైంది. 2014-15 నాటికి నిత్యం 92 శాతం టీన్స్ ఇంటర్ నెట్ వినియోగిస్తుంటే అది ఇపుడు 97 శాతానికి చేరింది. ఆన్ లైన్ వినియోగిస్తున్న టీన్స్ సంఖ్య 2014-15 నుంచి నేటికి రెట్టింపైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News