Saturday, November 15, 2025
Homeటెక్నాలజీSmartPhones: 7000mAh బ్యాటరీతో చౌకైన 5G ఫోన్లు..ధర కేవలం రూ. 17,999 నుంచి ప్రారంభం!

SmartPhones: 7000mAh బ్యాటరీతో చౌకైన 5G ఫోన్లు..ధర కేవలం రూ. 17,999 నుంచి ప్రారంభం!

7000mAh Battery Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? ప్రస్తుత ఫోన్ బ్యాటరీ బ్యాకప్ గురించి ఇబ్బంది పడుతున్నారా? బిగ్ బ్యాటరీ ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ కధనం మీకోసమే! 7000mAh బిగ్ బ్యాటరీ కలిగిన అనేక అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒప్పో నుంచి వన్ ప్లస్ వంటి బ్రాండ్ కంపెనీల స్మార్ట్ ఫోన్లు వరకు ఉన్నాయి. వీటిలో బిగ్ బ్యాటరీ మాత్రమే కాకుండా అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

- Advertisement -

vivo T4 5G

ఈ జాబితాలో మొదటి పరికరం వివో T4 5G. ఇది 7300mAh బిగ్ బ్యాటరీనతో వస్తుంది. ఇది మాత్రమే కాదు..ఈ ఫోన్ లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 చిప్‌సెట్‌ను అమర్చారు. ఈ వివో స్మార్ట్ ఫోన్ 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 32-మెగాపిక్సెల్ ముందు కెమెరాతో వస్తుంది. ఈ పరికరాన్ని ఇప్పుడే ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ.21,999 కు కొనుగోలు చేయవచ్చు. అయితే, కొన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో ఈ ఫోన్‌పై రూ. 1500 వరకు తగ్గింపును కంపెనీ అందిస్తోంది.

OPPO K13 5G

ఈ ఒప్పో స్మార్ట్ ఫోన్ 7000mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ జాబితాలో ఇదే అత్యంత చౌకైన ఫోన్. దీని ధర కేవలం రూ. 17,999 మాత్రమే. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్4 చిప్‌సెట్‌ను చూడవచ్చు. కంపెనీ ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.2000 బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇది పరికరం ధరను మరింత తగ్గిస్తుంది. దీనితో పాటు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ కూడా పొందవచ్చు.

 

Also Read: SmartPhones: అమెజాన్ ఫ్రీడమ్ సేల్‌..ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు..!

OnePlus Nord CE5 5G

వన్‌ప్లస్ ఇటీవల నోర్డ్ సిరీస్ కింద ఈ గొప్ప 5G ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ధర రూ. 25,000 కంటే తక్కువ ఉండడం విశేషం. ఈ పరికరం 7100mAh బిగ్ పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. పరికరం ధర ప్రస్తుతం రూ. 24,133. ఈ ఫోన్‌ కొనుగోలుపై ప్రత్యేక బ్యాంక్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు

realme 15 5G

రియల్‌మీ ఇటీవల దాని రెండు కొత్త గొప్ప స్మార్ట్‌ఫోన్‌లను కూడా విడుదల చేసింది. వాటిలో ఒకటి రియల్‌మీ 15 5G. ఈ కొత్త ఫోన్‌ను ఇప్పుడే కేవలం రూ. 25,999 కు కొనుగోలు చేసే అవకాశాన్ని కంపెనీ అందిస్తోంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ 7300+ ప్రాసెసర్‌తో 7000mAh బిగ్ బ్యాటరీని పొందొచ్చు. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఇది దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది.

IQOO Z10 5G

ఈ జాబితాలోని చివరి ఫోన్ ఐక్యూ Z10 5G. ఈ ఐక్యూ ఫోన్ 7300mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ పరికరంలో 50 మెగాపిక్సెల్ వెనుక కెమెరా ఉంటుంది. కాగా, ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి రూ. 20,939 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై కొన్ని బ్యాంక్ ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫోన్‌పై గొప్ప ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad