Tabs under 15K: పిల్లలు లేదా పెద్దలు ఇలా వయసుతో సంబంధం లేకుండా ఆన్‌లైన్ తరగతులు, ఇ-బుక్స్ చదవడం, మల్టీమీడియా కంటెంట్‌ను యాక్సెస్ చేయడం, ఇతర పనుల కోసం ప్రతి ఒక్కరికి బిగ్ స్క్రీన్ ఉన్న టాబ్లెట్ అవసరం. దీనితో వాళ్ల పని సులభంగా చేసుకోవచ్చు. మార్కెట్లో బడ్జెట్ ధరలో అనేక టాబ్లెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ తక్కువ ధరకే బెస్ట్ టాబ్లెట్ కొనుగోలు చేయాలనీ చూస్తున్నారా..? ఇప్పుడు కేవలం రూ. 15,000 లోపు అందుబాటులో ఉత్తమ టాబ్లెట్ల డీల్స్ గురుంచి తెలుసుకుందాం. వీటిలో లెనోవా, రియల్‌మీ, నోకియా, రెడ్‌మీ వరకు టాబ్లెట్‌లు ఉన్నాయి.
Honor Pad X9
హానర్ టాబ్లెట్ 12.1-అంగుళాల 2K డిస్‌ప్లే కలిగి ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 13 OS తో పనిచేస్తున్న ఈ టాబ్లెట్ 7250mAh బ్యాటరీతో వస్తుంది. దీని 6GB RAM+128GB వేరియంట్ ధర అమెజాన్‌లో రూ. 13,999.
Lenovo Tab M11
లెనోవా ట్యాబ్ M11 90Hz రిఫ్రెష్ రేట్, Helio G88 ప్రాసెసర్‌తో 11-అంగుళాల FHD LCD డిస్‌ప్లే ఉంది. ఇది 7040mAh బ్యాటరీ, 13MP వెనుక, 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీని 4GB RAM+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,799గా ఉంది.
Realme Pad 2 Lite
ఈ ట్యాబ్ 10.95-అంగుళాల 2K డిస్‌ప్లే కలిగి ఉంది. MediaTek Helio G99 చిప్‌సెట్ ను అమర్చారు. ఈ ట్యాబ్ 8300mAh బ్యాటరీతో, Android 14 OS తో పనిచేస్తుంది. దీని ధర రూ. 14,699గా ఉంది.
Redmi Pad SE
Redmi టాబ్లెట్‌లో 11-అంగుళాల FHD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉన్నాయి. 8000mAh బ్యాటరీ, Android 13 OS తో పనిచేస్తుంది. దీని ధర కేవలం రూ. 10,900.
నోకియా T10
నోకియా టాబ్లెట్ 8-అంగుళాల HD డిస్ప్లే, Unisoc T606 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 5000mAh బ్యాటరీ వస్తుంది Android 12 OS ఆధారంగా పనిచేస్తుంది. ఈ టాబ్లెట్ Wi-Fi వెర్షన్‌లో అందుబాటులో ఉంది. నోకియా టాబ్లెట్ ధర రూ. 8,455
నోట్: టాబ్లెట్ల ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.