July Upcoming Smartphones: జూలై వచ్చేస్తోంది. ఇది టెక్ ప్రియులకు చాలా ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ నెల ప్రారంభంలో భారత మార్కెట్లో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. జూన్ చివరి వారంలో లాంచ్ అయిన స్మార్ట్‌ఫోన్‌లు కూడా జులై మొదటి వారంలో అమ్మకలకు అందుబాటులో రానున్నాయి. వచ్చే నెలలో నథింగ్ టు శామ్‌సంగ్ వంటి ఫోన్ తయారీదారుల స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేయనున్నాయి. అయితే, ఈరోజు మనం జూలై మొదటి వారంలో లాంచ్ కానున్న స్మార్ట్‌ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.
OnePlus Nord 5
వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్ భారతదేశంలో జూలై 8, 2025న రిలీజ్ అవుతుందని సమాచారం. నార్డ్ 5 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ 5,200mAh బ్యాటరీ తో 80W సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇక ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..
డిస్ప్లే:- 6.83 అంగుళాలు, పూర్తి HD + AMOLED
RAM:- 12GB వరకు
స్టోరేజ్:- 512GB వరకు
వెనుక కెమెరా:- 50 MP + 8 MP
సెల్ఫీ కెమెరా:- 50 MP
బ్యాటరీ:- 5,200mAh
ఛార్జర్ సపోర్ట్:- 80W సూపర్‌వూక్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్:- ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఆక్సిజన్ OS 15
ప్రాసెసర్:- స్నాప్‌డ్రాగన్ 8s Gen 3
Nothing Phone 3
ఇండియాలో నథింగ్ ఫోన్ 3 జూలై 1, 2025న రిలీజ్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ UK-ఆధారిత OEM “మొదటి నిజమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్” అని తెలుస్తోంది. ఈ ఫోన్ గురించి కొంత సమాచారం అధికారిక నిర్ధారణతో ఉంది. అయితే లీక్‌ల ద్వారా ఈ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
డిస్ప్లే:- 6.7 అంగుళాలు, LTPO OLED
వెనుక కెమెరా:- 50 MP + 50 MP + 50 MP
సెల్ఫీ కెమెరా:- 50 MP
బ్యాటరీ:- 5,150mAh
ఛార్జర్ సపోర్ట్:- 100W ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్:- ఆండ్రాయిడ్ 15-ఆధారిత నథింగ్ OS 3.5
ప్రాసెసర్:- స్నాప్‌డ్రాగన్ 8s Gen 4
OnePlus Nord CE 5
OnePlus Nord 5తో పాటు OnePlus Nord CE5 కూడా జూలై 8న లాంచ్ కానుంది. దాని స్పెసిఫికేషన్లలో కంపెనీ కొన్ని ధృవీకరించింది. మరికొన్ని లీక్‌ల ద్వారా కూడా వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే..
డిస్ప్లే:- 6.77 అంగుళాలు, పూర్తి HD + AMOLED
RAM:- 8GB వరకు
స్టోరేజ్:- 256GB వరకు
వెనుక కెమెరా:- 50 MP + 8 MP
సెల్ఫీ కెమెరా:- 16 MP
బ్యాటరీ:- 5,200mAh
ఛార్జర్ సపోర్ట్:- 80W ఛార్జింగ్ సపోర్ట్
ప్రాసెసర్:- మీడియాటెక్ డైమెన్సిటీ 8350
ఆపరేటింగ్ సిస్టమ్:- ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఆక్సిజన్ OS 15
Samsung Galaxy Z Series
శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, ఫ్లిప్ 7 స్మార్ట్‌ఫోన్‌లను జూలై 9న మార్కెట్లోకి రానున్నాయి. పరిచయం చేయవచ్చు. స్పెసిఫికేషన్ గురించి చెప్పాలంటే.. రెండు ఫోన్‌లు వాటికవే ప్రత్యేకంగా ఉంటాయి. గెలాక్సీ Z ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ 7 8-అంగుళాల ప్రధాన డిస్‌ప్లే ఉంటుంది. 6.5-అంగుళాల కవర్ డిస్‌ప్లేను ఉంటుంది. దీనికి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది. వెనుక కెమెరాలో 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంటుంది. ఇది 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,400mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇక Samsung Galaxy Z Flip 7 గురించి మాట్లాడితే.. ఈ ఫోన్ లో Snapdragon 8 Elite చిప్‌సెట్‌ను అమర్చారు.12GB RAM కాకుండా ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లతో రావొచ్చని సమాచారం. అవి 256GB, 512GB, 1TB. వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉండవచ్చు. వీటిలో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండవచ్చు.