Friday, February 13, 2026
Homeటెక్నాలజీOpenChat: మస్క్ ఆఫర్‌నే కాదన్నారు.. 22 ఏళ్ల కుర్రాళ్ళ సంచలనం.. ఓపెన్ ఏఐని మించిన 'నెక్స్ట్...

OpenChat: మస్క్ ఆఫర్‌నే కాదన్నారు.. 22 ఏళ్ల కుర్రాళ్ళ సంచలనం.. ఓపెన్ ఏఐని మించిన ‘నెక్స్ట్ జెన్’ టెక్నాలజీ ఇదే!

They Said No To Musk 22-Year-Olds Built Next-Gen AI: ప్రపంచ కుబేరుడు, టెక్నాలజీ రారాజు ఎలాన్ మస్క్ (Elon Musk) పిలిచి మరీ కోట్లాది రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం ఇస్తానంటే ఎవరైనా కాదంటారా? కానీ ఇద్దరు 22 ఏళ్ల యువకులు మాత్రం ఆయన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. కేవలం తిరస్కరించడమే కాదు, ఇప్పుడు ఏకంగా మస్క్ కంపెనీలకే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగారు. వాళ్లే విలియం చెన్, గ్వాన్ వాంగ్. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న సేపియంట్ ఇంటెలిజెన్స్ (Sapient Intelligence) సంస్థ వ్యవస్థాపకులు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓపెన్ ఏఐ (OpenAI), డీప్‌సీక్ (DeepSeek) వంటి దిగ్గజాల కంటే మెరుగ్గా పనిచేసే Hierarchical Reasoning Model (HRM) అనే కొత్త టెక్నాలజీని వీరు అభివృద్ధి చేశారు.

- Advertisement -

ALSO READ: AI Job Loss: రాబోయే పదేళ్లలో 30 లక్షల ఉద్యోగాలకు ఎసరు.. AI ధాటికి ఆ రంగాలు కనుమరుగు!

పాండోరా బాక్స్ తెరిచారు!

మిచిగాన్ హైస్కూల్ నుంచే వీరి స్నేహం మొదలైంది. గ్వాన్ వాంగ్‌కి అల్గారిథమ్స్ అంటే ప్రాణం అయితే, విలియం చెన్‌కి ఇంజనీరింగ్ సిస్టమ్స్ అంటే ఆసక్తి. వీరికి ఉన్న కల ఒక్కటే.. “మనుషుల కంటే తెలివైన ఏఐ (AI)ని తయారు చేయడం”. “మేము చేయకపోతే భవిష్యత్తులో ఇంకెవరో చేస్తారు, అందుకే మేమే ఆ పని మొదట చేయాలి” అని చెన్ అంటారు. చైనాలోని సింఘువా యూనివర్సిటీలో చదువుతూనే వీరు ప్రయోగాలు మొదలుపెట్టారు. వీరు మొదట తయారు చేసిన ‘ఓపెన్ చాట్’ (OpenChat) అనే మోడల్ విద్యావేత్తల దృష్టిని ఆకర్షించింది.

మస్క్ పిలుపు.. వీరి గెలుపు

ఓపెన్ చాట్ విజయం చూసిన ఎలాన్ మస్క్, తన సొంత ఏఐ కంపెనీ ‘xAI’లో చేరాలంటూ వీరికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. కానీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs)లో కొన్ని లోపాలు ఉన్నాయని గ్రహించిన ఈ మిత్రద్వయం, ఆ పరిమితులను దాటడానికి సొంత కుంపటి పెట్టుకున్నారు. మస్క్ ఆఫర్‌ని కాదని, సొంత ప్రయోగాల వైపు అడుగులు వేశారు. ఆ నిర్ణయమే ఇప్పుడు ‘సేపియంట్ ఇంటెలిజెన్స్’ రూపంలో ప్రపంచం ముందుకు వచ్చింది.

ఊహించడం కాదు.. ఆలోచించడం!

ప్రస్తుతం మనం వాడుతున్న చాట్ జీపీటీ (ChatGPT) వంటివి గణాంకాల ఆధారంగా తర్వాతి పదాన్ని కేవలం ‘ఊహిస్తాయి’ (Guessing). కానీ వీరు సృష్టించిన HRM మోడల్ మాత్రం మనిషిలాగా ‘ఆలోచిస్తుంది’ (Thinking). జూన్ నెలలో వీరు చేసిన ఒక చిన్న ప్రయోగం (కేవలం 27 మిలియన్ పారామీటర్లతో) పెద్ద సంచలనం సృష్టించింది. క్లిష్టమైన సుడోకు పజిల్స్, చిక్కుముడులు విప్పడంలో ఇది ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ సిస్టమ్స్ కంటే అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది.

తప్పులు చేయని టెక్నాలజీ

సాధారణ ఏఐలు అప్పుడప్పుడు లేనిది ఉన్నట్లుగా భ్రమపడతాయి (Hallucinations). కానీ తమ మోడల్ చాలా కచ్చితంగా ఉంటుందని చెన్ చెబుతున్నారు. వాతావరణ అంచనాలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, వైద్య రంగంలో ఈ కొత్త టెక్నాలజీ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. త్వరలోనే వీరు అమెరికాలో తమ ఆఫీసును తెరవబోతున్నారు. మస్క్ ఆఫర్ కాదన్నందుకు వారు ఇప్పుడు అంతకు మించిన విజయాన్ని, గుర్తింపును సొంతం చేసుకున్నారు.

ALSO READ: Top 5 Smartphones: మార్కెట్‌ను షేక్ చేయనున్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News