Best 3 Mobiles Under 30K: కొత్త ఫోన్ కొనడానికి ప్లాన్ చేస్తున్నారా..? మార్కెట్లో మిడ్-రేంజ్ విభాగంలో అనేక 5G స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్ హై-రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌లు, అద్భుతమైన కెమెరాలను అందిస్తాయి. కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి మీ బడ్జెట్ 30 వేల రూపాయల కంటే తక్కువ ఉంటే, గొప్ప పనితీరుతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Samsung Galaxy M56
మీ బడ్జెట్ 30 వేల రూపాయల కంటే తక్కువ ఉంటే శామ్‌సంగ్ గెలాక్సీ M56 మీకు బెస్ట్ ఆప్షన్. ఇందులో 6.74 అంగుళాల సూపర్ AMOLED ప్లస్, 120Gz డిస్‌ప్లే ఉంది. ఇక వీడియో ఫోటోగ్రఫీ కోసం..ఈ పరికరం 50MP + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం..ఇందులో 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. పనితీరు విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో Exynox 1480 ప్రాసెసర్ ను అమర్చారు. ఈ మొబైల్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. One UI 7 ఆధారంగా Androidలో పనిచేస్తుంది. దీని 8GB+ 128GB వేరియంట్ ధర రూ. 27,999.
iQOO NEO 10
ఐక్యూ నియో 10 స్మార్ట్ ఫోన్ కొనడానికి మంచి ఎంపిక. దీని 8GB+ 128GB వేరియంట్‌ల ధర రూ. 29,999. ఈ స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల AMOLED, 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. వీడియో ఫోటోగ్రఫీ కోసం.. ఇది 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇక సెల్ఫీల కోసం..ఇందులో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. పనితీరు విషయానికొస్తే .. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్ ఉంది. ఇది 7000 mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ పరికరం Funtouch OS 15 ఆధారంగా Android లో పనిచేస్తుంది.
POCO F7
ఈ ఫోన్ 6.83-అంగుళాల OLED, 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. వీడియో ఫోటోగ్రఫీ కోసం.. ఈ పరికరం 50MP+8MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీనికి 20MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్ ఉంది. దీనికి 7550 mAh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఈ ఫోన్ HyperOS 2.0 ఆధారంగా Android లో నడుస్తుంది. దీని 8GB+128GB వేరియంట్‌ల ధర రూ. 29,999.