Friday, December 12, 2025
Homeటెక్నాలజీTop-5 Smartphones: హైరేంజ్‌ ఫోటోగ్రఫీకి టాప్‌ 5 బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లు.. వీటిలో ఫోటోలు తీస్తే వావ్‌...

Top-5 Smartphones: హైరేంజ్‌ ఫోటోగ్రఫీకి టాప్‌ 5 బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లు.. వీటిలో ఫోటోలు తీస్తే వావ్‌ అనాల్సిందే..!

Top-5 Smartphones with Best Camera Quality: తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లతో మార్కెట్‌లోకి స్మార్ట్‌ఫోన్లు రిలీజవుతున్నాయి. అంతేకాదు, అసలైన డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అధిరిపోయే కెమెరా క్వాలిటీతో అధరగొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కెమెరాలకు బదులు హైఎండ్ ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ డిమాండ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు అన్ని కంపెనీలు టాప్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లను టెక్ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. దీపావళి సందర్భంగా అనేక ఆఫర్లను అందిస్తున్నాయి. మీరు కొత్త ఫోన్‌తో ఫెస్టివల్‌ని ఎంజాయ్ చేయాలని చూస్తుంటే టాప్ 5 స్మార్ట్‌ఫోన్ల గురించి తెలుసుకుందాం. ఇందులో లాగ్ ఫ్రీ ప్రాసెసర్, లాంగ్ బ్యాటరీ లైఫ్, హై-ఎండ్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి. అవేంటో చూద్దాం.

- Advertisement -

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌ 25 అల్ట్రా
శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో 200MP ప్రైమరీ కెమెరా, 6.9-అంగుళాల క్వాడ్ HD+ స్క్రీన్‌ ఉంటుంది. నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నందున ఇది ఫోటోగ్రాఫీకి అనుకూలంగా ఉంటుంది. దీనిలో 5000mAh బ్యాటరీ, 12జీబీ ర్యామ్ వంటివి ఉంటాయి. 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఇది టాప్ ఎండ్ పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ రూ.1,04,719 ధర వద్ద లభిస్తుంది.

ఐఫోన్‌ 17 ప్రో మాక్స్‌

ఈ స్మార్ట్‌ఫోన్‌లో మూడు 48 మెగాపిక్సెల్ కెమెరాలు, 6.9 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే ఉంటుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ అసాధారణమైన ఫోటోగ్రఫీ, వీడియో అనుభవాన్ని అందిస్తుంది. A19 ప్రాసెసర్ ద్వారా భారీ టాస్కింగ్ చేయచ్చు. 2 టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫొన్‌ రూ.149,900 ధర వద్ద లభిస్తుంది.

వన్‌ప్లస్‌ 13
వన్‌ప్లస్ 13లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, మూడు 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాలు, 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. దీనికి 100W రాపిడ్ ఛార్జర్, 6000mAh బ్యాటరీ వంటివి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.70,999 వద్ద లభిస్తుంది.

గూగుల్‌ పిక్సెల్‌ 10 ప్రో
గూగుల్ పిక్సెల్ 10 ప్రో అద్భుతమైన వేగాన్ని అందించే టెన్సర్ G5 సీపీయూ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. 6.3 అంగుళాల క్వాడ్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. 42మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, మూడు 48మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాలు ఉంటాయి. దీని బ్యాక్‌ కెమెరాలు క్వాలిటీ వీడియో కాలింగ్, ఫోటోగ్రఫీ అందిస్తాయి. ఇది రూ.109,999 వద్ద లభిస్తుంది. దీనిలో 4870mAh బ్యాటరీ ఉంటుంది.

శామ్‌సంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 7
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7.. 8 అంగుళాల ఫోల్డబుల్ స్క్రీన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మల్టీ టాస్కింగ్‌ను చేయగలదు. దీనిలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ఇవి ది బెస్ట్ ఫోటోగ్రఫీ, వీడియో షూటింగ్ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 4400mAh బ్యాటరీతో వస్తుంది. రూ.186,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News