కొత్త కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి అందరూ ఆహ్వానం పలికారు. అయితే ఈ ఏడాది కారు కొనుగోలు చేయాలనుకనే వారికి ఇదొక మంచి అవకాశం. ఈ నెల కొన్ని కార్లు లాంచ్ కానున్నాయి. కొత్త సంవత్సరం మార్కెట్లోకి ఎన్ని కార్స్ రాబోతున్నాయో తెలుసా.. అన్నీ న్యూ ఇయర్, సంక్రాంతి వేడుకలకు మీ ఇంటి సంబరాన్ని మరింత పెంచడానికి వచ్చేస్తున్నాయి. అయితే జనవరిలోనే టాప్ మోడల్ EV కార్లు విడుదల కానున్నాయి. ఈ నెల వనున్న టాప్ మోడల్ కార్స్ ఏంటో చూద్దాం రండి..
హ్యుందాయ్ క్రెటా EV: హ్యుందాయ్ క్రెటా, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ (ICE)తో ఒక ఏడాది మార్కెట్‌లో ఉన్న ఈ కారు, ఇప్పుడు ఈ మోడల్‌ను పూర్తిగా ఎలక్ట్రిక్ వర్షన్‌గా విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ వార్తను కంపెనీ ఇప్పటికే తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ధృవీకరించింది. 2025 భారత్ మొబిలిటీ షోలో ఈ ఎలక్ట్రిక్ మోడల్‌ను జనవరి 17న పరిచయం చేయనున్నారు.
MG సైబర్‌స్టర్: జేఎస్డబ్ల్యూ MG తన కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు సైబర్‌స్టర్‌ను ఈ సంవత్సరం పెద్ద లాంచ్‌గా విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ మోడల్ భారతదేశంలోని MG సెలెక్ట్ ప్రీమియం రిటైల్ ఛానెల్ ద్వారా విక్రయించనుంది. ఇది MG లైనప్ నుంచి విడుదల కానున్న మొదటి కారు.
మెర్సిడెస్ G 580: జర్మన్ కార్ తయారీదారు మెర్సిడెస్-బెన్ ఈ సంవత్సరం పెద్ద లాంచ్‌తో ప్రారంభం కానుంది. జి-క్లాస్ లేదా జి-వ్యాగన్‌ను పూర్తిగా ఎలక్ట్రిఫైడ్ వర్షన్‌గా జనవరి 9న విడుదల చేయనుంది.