Branded Smart Tv: నవరాత్రితో పండుగ సీజన్ ప్రారంభమైంది. దీంతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తోంది. ఈ సేల్స్ లో కేవలం స్మార్ట్‌ఫోన్‌లపై మాత్రమే కాకుండా స్మార్ట్ టీవీలపై కూడా గొప్ప డీల్స్ ను అందిస్తున్నాయి. సోనీ, ఎల్‌జి మరియు శామ్‌సంగ్ వంటి బ్రాండ్‌ల టీవీలు కూడా చాలా తక్కువ ధరలకు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. పండగ వేళ తక్కువ ధరకే కొత్త టీవీ కొనాలని చూస్తున్నవారు, ఈ సేల్ అస్సలు మిస్ అవ్వకండి. సేల్‌లో అందుబాటులో ఉన్న 5 ఉత్తమ స్మార్ట్ టీవీ డీల్స్ జాబితా గురించి ఇక్కడ తెలుసుకుందాం.
Samsung Crystal 4K Infinity Vision 65 inch Ultra HD (4K) LED Smart Tizen TV 2025
ఈ జాబితాలోని మొదటి టీవీ శామ్‌సంగ్ నుండి వచ్చింది. ఇది ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కేవలం రూ.58,990కి లభిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ టీవీపై ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికలతో అదనంగా రూ.3000 తగ్గింపు పొందవచ్చు. అదనంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIతో ఈ టీవీపై రూ.1500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇంకా, ఈ టీవీపై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఇక్కడ రూ.4650 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందవచ్చు.
LG 164 cm (65 inches) UA82 Series 4K Ultra HD Smart webOS LED TV
ఈ లిస్ట్ లో రెండవ టీవీ LG నుండి వచ్చింది, ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో ఈ టీవీని కేవలం రూ.56,990కి లభిస్తుంది. ఈ టీవీపై కొన్ని గొప్ప బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా దీన్ని ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. SBI డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే, ఈ టీవీపై రూ.1,500 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే EMI ఎంపిక ద్వారా రూ.1,750 వరకు తగ్గింపు పొందవచ్చు. అదనంగా, ప్రత్యేక నో-కాస్ట్ EMI ఎంపిక అందుబాటులో ఉంది. ఇది ఈ టీవీని రూ.5,722 EMIతో కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. ఈ టీవీతో కంపెనీ ఉచిత ఇన్‌స్టాలేషన్‌ను కూడా అందిస్తోంది.
also read:Smart TV Under 12K: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్ సేల్..కేవలం రూ.12వేల లోపు లభించే 5 బ్రాండెడ్ టీవీలు..
SONY Bravia 2 163.9 cm (65 inch) Ultra HD (4K) LED Smart Google TV
ఈ టీవీని ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో కేవలం రూ.67,490కి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ 51% వరకు తగ్గింపుతో లభిస్తుంది. ఏదైనా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా UPI ఉపయోగించి దీన్ని కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపిక, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఎంపికలతో ఈ టీవీ రూ.1,500 వరకు తగ్గింపుతో లభిస్తుంది. అయితే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.1,250 తగ్గింపును పొందవచ్చు. అదనంగా, రూ.4,650 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తున్నారు.
TCL 65 inches Metallic Bezel Less Series 4K Ultra HD Smart LED Google TV
జాబితాలో తదుపరి టీవీ TCL నుండి వచ్చింది. అమెజాన్‌లో కేవలం రూ.45,990కి కొనుగోలు చేయొచ్చు. ఈ టీవీ గొప్ప బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తుంది. ఇక్కడ SBI డెబిట్ కార్డ్‌తో చెల్లిస్తే, రూ.1,500 తగ్గింపు పొందవచ్చు. ఇక EMI ఎంపికతో రూ.1,750 వరకు తగ్గింపు లభిస్తుంది. EMI ఎంపిక లేకుండా క్రెడిట్ కార్డ్‌తో రూ.1,500 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు.
నోట్: ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి


