Thursday, February 6, 2025
Homeటెక్ ప్లస్Train Ticket: ట్రైన్ టికెట్ పోయినా ఎలా ప్రయాణం చేయవచ్చో తెలుసా.. ఈ టిప్స్ మీకోసమే..

Train Ticket: ట్రైన్ టికెట్ పోయినా ఎలా ప్రయాణం చేయవచ్చో తెలుసా.. ఈ టిప్స్ మీకోసమే..

ప్రతిరోజు కోట్లాది మంది జనం రైల్వే ప్రయాణం చేస్తారు. రైలు ప్రయాణం చేసేటప్పుడు కచ్చితంగా టికెట్ ఉండాలి లేదంటే జరిమానాలు ఉంటాయి. కానీ, కొన్ని సందర్భాలలో టికెట్ పోతే కంగారు పడతాము. అలాంటప్పుడు ఏమి చేయాలో తెలియక కంగారు పడతాము. కానీ ఈ సమస్యకు భారతీయ రైల్వే సంస్థ పరిష్కారం చూపించింది.

- Advertisement -

మీరు టికెట్ పోగొట్టుకుంటే ఏమి చేయాలి?

మీరు టికెట్ పోగొట్టుకున్నట్లయితే, ముందుగా మీరు ప్రయాణించే రైల్లో టీటీఈ (ట్రైన్ టికెట్ ఎగ్జామినర్)కి ఈ విషయం చెప్పాలి. అతనికి మీ వివరాలను చెబితే, డూప్లికేట్ టికెట్ ఇస్తారు. కానీ, దీనికి మీరు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

డూప్లికేట్ టికెట్ కోసం ఫీజు:

  • స్లీపర్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్ టికెట్ పోగొట్టినప్పుడు, 50 రూపాయిలు చెల్లించాలి.
  • ఫస్ట్ క్లాస్ టికెట్ పోగొట్టినప్పుడు, 100 రూపాయిలు చెల్లించాలి.
  • టికెట్ చిరిగిపోయినప్పుడు, 25% చార్జీ చెల్లించాలి.

చివరి నిమిషంలో టికెట్: మీరు చివరి నిమిషంలో టికెట్ పొందాలనుకుంటే, కరెంట్ టికెట్ సిస్టమ్(UTS) ద్వారా టికెట్లు పొందవచ్చు. 5 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేయవచ్చు. ఐఆర్‌సీటీసీ యాప్ ద్వారా మీరు వెళ్లాలి అనుకుంటున్న ట్రైన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి చార్ట్ వేకెన్సీలో సీట్లు కాళీ ఉంటే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు, టికెట్ పోయినా లేదా చిరిగినా మీకు ఎలాంటి సమస్య ఉండదు. రైల్వే అధికారులతో సంప్రదించి, డూప్లికేట్ టికెట్ పొందవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News