Triumph Bonneville T40 price and features : ద్విచక్ర వాహన ప్రియుల గుండెల్లో గుబులు రేపుతూ, క్లాసిక్ అందాలకు ఆధునిక సాంకేతికతను జోడించి బ్రిటిష్ దిగ్గజ సంస్థ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ సరికొత్త ముస్తాబుతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఐకానిక్ బోనెవిల్లే సిరీస్‌ను 350-400సీసీ శ్రేణిలోకి విస్తరిస్తూ తీసుకొచ్చిన ఈ బైకులు రోడ్లపై కనువిందు చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే, ఈ సరికొత్త రాయల్ రైడ్స్ ప్రత్యేకతలేమిటి?
విడుదలైన వేరియంట్లు – ధరల వివరాలు
ట్రయంఫ్ సంస్థ భారత మార్కెట్లో మూడు సరికొత్త మోడళ్లను ఆవిష్కరించింది:
బోనెవిల్లే T4: రూ. 2.55 లక్షలు (ఎక్స్-షోరూమ్)
బోనెవిల్లే T40 & T40 బ్లాక్: రూ. 2.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)
డిజైన్ సొగసులు – రెట్రో హంగులు : ఈ బైకులు కాలాతీత వింటేజ్ డిజైన్‌తో ముస్తాబయ్యాయి. టియర్-డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, పీషూటర్ ఎగ్జాస్ట్, స్పోక్డ్ వీల్స్‌తో ఆకట్టుకుంటున్నాయి.
T40: డ్యూయల్-టోన్ రంగులు, చేతితో గీసిన పిన్‌స్ట్రైపింగ్, బ్రష్డ్ అల్యూమినియం ఫినిషింగ్‌తో వస్తుంది.
T40 బ్లాక్: మ్యాట్ ప్యూటర్ గ్రే, గ్లాస్-బ్లాక్ రిమ్స్, బ్లాక్-అవుట్ ఇంజిన్‌తో మరింత డార్క్ లుక్ సొంతం చేసుకుంది.
T4: ఫాంటమ్ బ్లాక్, కార్నివాల్ రెడ్, కాంపిటీషన్ గ్రీన్ అనే మూడు సింగిల్-టోన్ రంగుల్లో లభిస్తుంది.
ఇంజిన్ సామర్థ్యం & పనితీరు : ఈ మోడళ్లలో 349cc లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ TR-సిరీస్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7,000 rpm వద్ద 28.6 bhp పవర్, 5,500 rpm వద్ద 31.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లో-ఎండ్, మిడ్-రేంజ్ రైడింగ్‌లో సాఫీగా సాగేలా దీని సిలిండర్ హెడ్‌ను ప్రత్యేకంగా ట్యూన్ చేశారు.
ఆధునిక ఫీచర్లు :
T40 సిరీస్: 4-అంగుళాల TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్/ఫుల్ మ్యాప్ నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ABS మరియు ఐదు రైడింగ్ మోడ్స్‌తో లభిస్తుంది.
T4 మోడల్: కలర్ LCD డిస్‌ప్లే, డ్యూయల్-ఛానల్ ABS, ఎమర్జెన్సీ డీసెలరేషన్ వార్నింగ్, USB-C ఛార్జింగ్‌తో అందుబాటులోకి వచ్చింది. క్లాసిక్ డిజైన్‌తో పాటు ఆధునిక హంగులు కోరుకునే భారతీయ రైడర్లకు ఈ సరికొత్త ట్రయంఫ్ బోనెవిల్లే త్రయం చక్కటి ఎంపికగా నిలవనుంది

