Sunday, July 13, 2025
Homeటెక్నాలజీTVS Apache RTR 160 2V:డ్యూయల్-ఛానల్ ABSతో టీవీఎస్ నుంచి కొత్త బైక్.. ధర ఎంతంటే..?

TVS Apache RTR 160 2V:డ్యూయల్-ఛానల్ ABSతో టీవీఎస్ నుంచి కొత్త బైక్.. ధర ఎంతంటే..?



TVS Apache RTR 160 2V Launched: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు TVS మోటార్ తన కొత్త TVS Apache RTR 160 2Vని మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ ఈ బైక్ ని అత్యంత ప్రత్యేకమైన డ్యూయల్-ఛానల్ ABS, OBD-2B కంప్లైంట్ ఇంజిన్‌తో తీసుకొచ్చింది. దీని కారణంగానే ఈ బైక్ మునుపటి కంటే మరింత శక్తివంతమైన బైక్‌గా వస్తోంది. కంపెనీ దీని ప్రారంభ ధర రూ. 1,34,320(ఎక్స్-షోరూమ్)గా పేర్కొంది. ఇది 2024 మోడల్ టాప్-స్పెక్ వేరియంట్ కంటే రూ. 3,800 ఎక్కువ ఖరీదైనది. ఈ బైక్ మ్యాట్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే రెండు రంగుల ఎంపికలలో కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు ఈ బైక్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

గత ఏడాది మోడల్ నే ఈ బైక్ లోనూ అదే డిజైన్ కొనసాగించారు. ఇందులో ఎరుపు అల్లాయ్ వీల్స్, ట్యాంక్ ఎక్స్‌టెన్షన్‌లు ఇచ్చారు. ఈసారి దీనికి కొత్త మ్యాట్ బ్లాక్ కలర్ ఆప్షన్ అందించారు. కంపెనీ అపాచీ RTR 160 కొత్త మోడల్ లో 159.7cc, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను అందించింది. ఈ మోటర్ సైకిల్ 16.04 PS శక్తిని, 13.85 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా, దీని ఇంజిన్ ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.

ఈ బైక్ డబుల్-క్రెడిల్ ఫ్రేమ్‌పై తయారు చేయబడింది. ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, డ్యూయల్ రియర్ గ్యాస్-చార్జ్డ్ షాక్ అబ్జార్బర్‌ను కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం 270mm ఫ్రంట్, 200mm రియర్ పెటల్ డిస్క్ బ్రేక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బైక్‌లో 7-అంగుళాల టైర్లు ఉన్నాయి. వీటిపై 90-సెక్షన్ ముందు, 120-సెక్షన్ వెనుక ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చారు. ఈ బైక్ లో 12 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం, ​​790mm సౌకర్యవంతమైన సీటు ఎత్తు, 180mm మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంది.

ఇకపోతే ఈ బైక్ TVS SmartXonnect బ్లూటూత్ కనెక్టివిటీతో LCD కన్సోల్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది వాయిస్ అసిస్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్, రైడ్ డేటా వంటి లక్షణాలను అందిస్తుంది. ఈ మోటర్ సైకిల్ స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడ్ మోడ్‌లను కూడా పొందుతుంది. ఈ బైక్ నేరుగా బజాజ్ పల్సర్ N150, హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 2V, హోండా SP160 , యమహా FZ-S Fi లతో పోటీపడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News