Ulefone Armor 33, Armor 33 Pro Launched: చైనాకు చెందిన ప్రముఖ బ్రాండ్ ఉలేఫోన్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఆర్మర్ 33, ఆర్మర్ 33 ప్రోను రిలీజ్ చేసింది. ప్రత్యేక విషయం ఏంటంటే.. ఈ సిరీస్ 22,500mAh బిగ్ బ్యాటరీ రావడం. ఇది ఒకే ఛార్జ్‌పై దాదాపు 10 రోజుల వరకు బ్యాకప్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోన్‌లో 64MP నైట్ విజన్ కెమెరా, మిలిటరీ-గ్రేడ్ బలం, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ సిరీస్ ఫోన్లకు సంబంధించి ధర, ఫీచర్ల వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఫీచర్లు:
రెండు మోడళ్లలో 6.95-అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 700 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఆర్మర్ 33 ప్రో వెనుక భాగంలో అదనంగా 3.4-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. అయితే, బేస్ వేరియంట్‌లో 1100 ల్యూమెన్‌ల సూపర్ బ్రైట్ LED లైట్ ఉంది. ఆర్మర్ 33లో మీడియాటెక్ హెలియో 100 చిప్‌సెట్, 12GB RAM ఉన్నాయి. మరోవైపు..ఆర్మర్ 33 ప్రోలో డైమెన్సిటీ 7300X చిప్‌సెట్, 16GB RAM ఉన్నాయి. రెండు ఫోన్‌లు 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 14 స్టాక్ వెర్షన్‌ను పొందుతాయి.
Also Read: Moto G86 Power 5G: 6,720mAh బిగ్ బ్యాటరీతో మోటో నుంచి G86 పవర్ 5G.. ధర, ఫీచర్లు ఇవే!
కెమెరా గురించి చెప్పాలంటే..ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. దీనికి 50MP ప్రధాన సెన్సార్, 64MP నైట్ విజన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. దీనితో పాటు, సెల్ఫీ కోసం..32MP ఫ్రంట్ కెమెరా అందించారు. ఇకపోతే బ్యాటరీ విషయానికి వస్తే.. ఉలేఫోన్ ఆర్మర్ 33, 33 ప్రో పెద్ద 22,500mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది 10W రివర్స్ ఛార్జింగ్‌ను కూడా కలిగి ఉంది. తద్వారా ఈ ఫోన్ పవర్ బ్యాంక్‌గా పని చేస్తుంది.
ఇది డస్ట్, వాటర్ నిరోధకతను కోసం IP68, IP69Kరేటింగ్‌లను అందించారు. ఇది 118dB లౌడ్ స్పీకర్లు, ఇన్ఫినిట్ హాలో 2.0 RGB లైట్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, కస్టమ్ బటన్లు వంటి ఫీచర్ల ను కూడా కలిగి ఉంది. ఆర్మర్ 33 ప్రో 5G కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. అయితే బేస్ వేరియంట్ 4G కి పరిమితం చేయబడింది.
లభ్యత, ఆఫర్లు
ఈ ఫోన్లు ఆగస్టు 18 నుండి ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయని Ulefone తెలిపింది. వినియోగదారులు Ulefone వెబ్‌సైట్, AliExpress ద్వారా దీనిని కొనుగోలు చేయొచ్చు. ఫోన్ పరిచయ ఆఫర్ కింద వీటిపై దాదాపు 50% వరకు తగ్గింపు లభిస్తుంది.


