Upcoming Phones This Week in Mobile Market: మార్కెట్లోకి ఈ వారం కొత్త ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. నవంబర్ 10, 17 మధ్య అనేక కొత్త మోడల్‌లు పరిచయం కానున్నాయి. మొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న వివో, నథింగ్, రియల్‌మీ నుండి కొత్త ఫోన్‌లు ఈ వారం హల్చల్ చేస్తున్నాయి. వీటి ధర, ఫిచర్ల వివరాలపై ఓ లుక్కేద్దాం.
వన్ ప్లస్ 15
నవంబర్ 13న లాంచ్ అవుతున్న వన్‌ప్లస్ 15 5G ప్రీమియం సెగ్మెంట్లో వస్తుంది. ఇందులో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్, 120W సూపర్‌వూక్ వైర్డ్, 50W ఎయిర్‌వూక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కూడిన 7,300mAh బ్యాటరీ, 165Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 6000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.78 అంగుళాల 1.5K స్క్రీన్ ఉంటుంది. దీని వెనుకవైపు, మూడు 50MP కెమెరాలతో IP66, IP68, IP69K ప్రొటక్షన్ అందిస్తుంది.
వివో వై 500 ప్రో
నవంబర్ 10న చైనాలో లాంచ్ అయ్యే వివో Y500 ప్రోతో వివో తన మొబైల్ ప్రియులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ మిడ్‌రేంజ్ ఫోన్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్, 200MP Samsung HP5 సెన్సార్, బలమైన 7,000mAh బ్యాటరీతో వస్తుంది. 6.67-అంగుళాల 1.5K OLED డిస్ప్లే, యాంటీ-గ్లేర్ శాటిన్ ఫినిష్ గ్లాస్ బ్యాక్ దాని ప్రీమియం అనుభూతిని అందిస్తాయి, అయితే IP68/69 రేటింగ్ ఫోన్ మన్నికను నిర్ధారిస్తాయి.
నథింగ్ ఫోన్ (3a) లైట్
లండన్లో ప్రారంభించిన తర్వాత, నథింగ్ ఫోన్ (3a) లైట్ ఈ నెలలో భారత్ మార్కెట్‌లో రిలీజయ్యే అవకాశం ఉంది. ట్రాన్స్‌పాంట్ డిజైన్, ఎసెన్షియల్ కీ, గ్లిఫ్ లైట్ బ్రాండ్ ప్రత్యేక లుక్ మరింత నిర్ధారిస్తాయి. ఈ ఫోన్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16MP సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. స్టైల్, స్మూత్ పెర్ఫార్మెన్స్ కోసం దీనిలో నథింగ్ OS 3.5ని కూడా బూట్ అందించింది.
రియల్ మీ సీ 85 5G
రియల్‌మీ త్వరలో భారతదేశంలో రియల్ మీ C85 5Gని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్‌లో డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 45W ఛార్జింగ్‌తో కూడిన పెద్ద 7000mAh బ్యాటరీ, 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 6.8 అంగుళాల HD+ LCD డిస్ప్లే ఉంటాయి. 50MP సోనీ IMX852 మెయిన్ కెమెరా కూడా ఉంటుంది. ఇది బడ్జెట్ 5G విభాగంలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్. వెంటనే ఈ స్మార్ట్ ఫోన్లు కొనేఎండి.


