Vivo G3 5G Launched: వివో తన G-సిరీస్ తాజా స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. కంపెనీ దీని వివో G3 5G పేరిట తీసుకొచ్చింది. ఈ పరికరం పోయిన ఏడాది జనవరిలో రిలీజ్ అయినా వివో G2 5G అప్‌గ్రేడ్ వేరియంట్. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.74 అంగుళాల బిగ్ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, సింగిల్ రియర్ కెమెరా, 6000mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం చైనాలో విడుదల అయినా ఈ ఫోన్ ప్రపంచ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే పూర్తి సమాచారం లేదు.
Vivo G3 5G ధర:
వివో G3 5G 6 GB RAM+128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లు (సుమారు రూ. 18,300)గా, హై-ఎండ్ 8 GB RAM+256 GB స్టోరేజ్ వేరియంట్ 1,999 యువాన్లకు (సుమారు రూ. 24,300)గా విడుదల చేశారు. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ డైమండ్ బ్లాక్ రంగులో లభిస్తోంది.
Also Read: Infinix Hot 60i 5G: రూ. 10 వేల కంటే తక్కువ ధరలో ఏఐ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G
Vivo G3 5G ఫీచర్లు:
ఈ వివో పరికరం 6.74 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది (720×1600 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌ను అందిస్తుంది. స్క్రీన్ 90 Hz రిఫ్రెష్ రేట్, 20: 9 యాస్పెక్ట్ రేషియోను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, Mali-g57 GPU ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌కు 6GB / 8GB RAM ఆప్షన్‌తో 256GB వరకు స్టోరేజ్ అందించారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను పవర్ చేయడానికి 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6000mAh బిగ్ బ్యాటరీని అందించారు. ఈ కొత్త Vivo స్మార్ట్‌ఫోన్‌కు SGS ఫైవ్-స్టార్ డ్రాప్-రెసిస్టెంట్ సర్టిఫికేషన్ ఇచ్చారు. కెమెరా విషయానికి వస్తే..ఈ స్మార్ట్‌ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 5-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా.. ఇందులో 5G, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, 3.5mm ఆడియో జాక్, IR బ్లాస్టర్, USB 2.0 పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పరికరం కొలతలు 167.3 x 76.95 x 8.19mm. బరువు 204 గ్రాములు.


