Vivo Pad 5e: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ వివో తన కస్టమర్ల కోసం సరికొత్త టాబ్లెట్ లాంచ్ చేసింది. కంపెనీ దీని వివో Pad 5e పేరిట తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యాడ్ 5, ప్యాడ్ 5 Pro మోడళ్లకు కొనసాగింపుగా ఈ కొత్త టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఈ టాబ్లెట్‌లతో పాటు కంపెనీ వివో వాచ్ GT 2, TWS 5 లను కూడా విడుదల చేసింది. 12-అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్ సెట్, 10,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో వస్తోన్న ఈ టాబ్లెట్ ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
వివో ప్యాడ్ 5e ధర, లభ్యత:
కొత్త వివో ప్యాడ్ 5e టాబ్లెట్ బ్లూ, బ్లాక్, పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఇక దీని సాఫ్ట్ లైట్ వెర్షన్ బ్లూ, బ్లాక్ రంగులలో వస్తుంది. ఈ వివో ప్యాడ్ 5e అక్టోబర్ 17 నుండి కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా చైనాలో విక్రయానికి రానుంది. ధర విషయానికి వస్తే ఈ వివో ప్యాడ్ బేస్ మోడల్ అయినా 8GBRAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ. 25,000)గా పేర్కొంది. అలాగే, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,299 (సుమారు రూ. 29,000)గా, 12GBRAM+256GB స్టోరేజ్ వేరియంట్ CNY 2,599 (సుమారు రూ. 32,000)గా, 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 2,999 (సుమారు రూ. 37,000)గా నిర్ణయించింది. వివో ప్యాడ్ 5e సాఫ్ట్ లైట్ వెర్షన్ కూడా లాంచ్ అయింది. దీని 8GBRAM+128GB స్టోరేజ్ వేరియంట్ CNY 2,199 (సుమారు రూ. 27,000)గా, 8GBRAM+256GB స్టోరేజ్ వేరియంట్ CNY 2,499 (సుమారు రూ. 31,000)గా ఉంది.
వివో ప్యాడ్ 5e ఫీచర్లు:
ఫీచర్ల పరంగా చూస్తే, ఈ టాబ్లెట్ 2.8K వరకు రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతుతో 12.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వివో ప్యాడ్ 5e స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 16GB వరకు RAM, 512GB నిల్వతో జత చేశారు. బేస్ వేరియంట్ LPDDR5X RAM, UFS 3.1 అంతర్గత నిల్వతో వస్తుంది. ఈ ప్యాడ్ 5e ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఆరిజిన్ఓఎస్ 5పై నడుస్తుంది.
ఆడియో విభాగంలో ఈ కొత్త వివో టాబ్లెట్‌లో నాలుగు-స్పీకర్ పనోరమిక్ ఆడియో సెటప్ ఉంది. ఇది ఏఐ ట్రాన్స్‌క్రిప్షన్, సర్కిల్ టు సెర్చ్, ఏఐ PPT అసిస్టెంట్, మల్టీ-స్క్రీన్ ఇంటర్‌కనెక్షన్, స్మాల్ విండో కొలాబరేషన్, వైర్‌లెస్ ప్రింటింగ్ వంటి అనేక ఏఐ-ఆధారిత సాధనాలకు మద్దతు ఇస్తుంది. ఫోటోగ్రఫీ పరంగా, వివో ప్యాడ్ 5e 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
బ్యాటరీ గురించి మాట్లాడితే, ఈ వివో ప్యాడ్ 10,000mAh బిగ్ బ్యాటరీతో 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇది USB టైప్-C పోర్ట్ ద్వారా ఛార్జ్ అవుతుంది. ఇది Wi-Fi 6, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీని అందిస్తుంది. టాబ్లెట్ 266.43×192×6.62mm సైజు ఉండగా, బరువు సుమారు 584 గ్రాములుగా ఉంది.


