Vivo T4 Lite 5G Launched: ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ వివో తమ వినియోగదారులకు బడ్జెట్ ధరల్లో ఫోన్లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగానే వివో కంపెనీ Vivo T4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా రిలీజ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌ను ప్రిజం బ్లూ, టైటానియం గోల్డ్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్న మొబైల్ కొనాలనుకునేవారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ కొత్త మొబైల్ కు సంబంధించి ధర, ఫీచర్లు తెలుసుకుందాం.
ధర
Vivo T4 Lite 5G మొబైల్ 4జీబీ+ 128 జీబీ వేరియంట్ ధర రూ.9,999గా పేర్కొంది. ఇదే సమయంలో 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.10999గా, 8జీబీ 256జీబీ వేరియంట్ ధర రూ.12,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ జూలై 2 నుండి దేశంలో ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.
ఫీచర్లు
Vivo T4 Lite 5G స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల హెచ్‌డి + (720 × 1,600 పిక్సెల్స్) ఎల్‌సిడి స్క్రీన్‌ను కలిగి ఉంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్‌ల గరిష్ట ప్రకాశం అందిస్తుంది. ఈ పరికరానికి టియువి రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ ఇవ్వబడింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అమర్చారు.
వివో టి4 లైట్ 5జి స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్‌ఓఎస్ 15 తో వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 15W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ IP64-రేటెడ్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్ బిల్డ్‌ను కలిగి ఉంది. భద్రత కోసం..ఈ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
కెమెరా గురుంచి మాట్లాడితే.. Vivo T4 Lite 5Gలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం.. 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ AI ఫోటో ఎన్‌హాన్స్, AI ఎరేస్ వంటి AI ఫీచర్లతో వస్తుంది. హ్యాండ్‌సెట్‌లో 5G, 4G, Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఫోన్ కొలతలు 167.30×76.95×8.19mm. దీని బరువు 202 గ్రాములు.