Saturday, November 15, 2025
Homeటెక్నాలజీVivo T4R 5G: 50MP కెమెరా, 5700mAh బ్యాటరీ, 6.77 అంగుళాల డిస్‌ప్లేతో వివో నయా...

Vivo T4R 5G: 50MP కెమెరా, 5700mAh బ్యాటరీ, 6.77 అంగుళాల డిస్‌ప్లేతో వివో నయా ఫోన్..

Vivo T4R 5G Launched: వివో తన కొత్త స్మార్ట్ ఫోన్ ను భారతదేశ మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ తన వివో T4 సిరీస్ కింద కొత్త వివో T4R 5G పేరిట పరిచయం చేసింది. ఈ పరికరం బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లతో వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తున్న ఈ మొబైల్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Vivo T4R 5G ధర:

కంపెనీ వివో T4R 5G స్మార్ట్ ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.19,499గా పేర్కొంది. అదేవిధంగా 8GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,499గా, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 23,499గా నిర్ణయించింది. ఈ పరికరం మొదటి సేల్ ఆగస్టు 5 నుండి వివో ఇండియా ఇ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ప్రారంభమవుతుంది. ఈ పరికరం బ్లూ, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది.

Vivo T4R 5G ఫీచర్లు:

ఈ వివో పరికరం 6.77-అంగుళాల పూర్తి-HD + క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 nits వరకు గరిష్ట ప్రకాశాన్ని అందించారు. అలాగే, ఫోన్ తక్కువ బ్లూ లైట్ కోసం HDR10 + మద్దతు, SGS సర్టిఫికేషన్‌ను పొందుతోంది. ఈ ఫోన్‌కు శక్తినివ్వడానికి మెడియటేక్ 7400 చిప్‌సెట్‌ను అమర్చారు. దీనితో 12GB వరకు LPDDR4X RAM, 256GB వరకు UFS 2.2 ఆన్‌బోర్డ్ నిల్వ అందుబాటులో ఉంది. కాగా ఈ వివో పరికరం Android 15-ఆధారిత FuntouchOS 15పై పనిచేస్తుంది. మెరుగైన పనితీరు కోసం..ఫోన్ 2 సంవత్సరాల పాటు OS నవీకరణలను, 3 సంవత్సరాల పాటు భద్రతా ప్యాచ్‌లను పొందుతుందని కంపెనీ పేర్కొంది.

Also read: Gaming Phones: గేమింగ్ లవర్స్ కోసం బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

ఫోన్ కెమెరా గురించి మాట్లాడితే.. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ బోకె లెన్స్ అందించారు. ఇక సెల్ఫీల కోసం.. 32-మెగాపిక్సెల్ ఇచ్చారు. ఈ పరికరం ముందు, వెనుక కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..ఈ పరికరం 5,700mAh బ్యాటరీతో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. అలాగే, ఈ పరికరం IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తోంది. ఈ పరికరం మందం కూడా 7.39mm మాత్రమే.

 

Vivo T4R 5G స్మార్ట్ AI టూల్స్:

వివో T4R 5G స్మార్ట్ ఫోన్ రోజువారీ పనులను సులభతరం, వేగవంతం చేసేందుకు స్మార్ట్ AI లక్షణాలను కలిగి ఉంది. ఇందులో AI డాక్యుమెంట్స్, సర్కిల్ టు సెర్చ్, AI నోట్ అసిస్ట్, స్క్రీన్ ట్రాన్స్‌లేషన్, ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్ వంటి సాధనాలు ఉన్నాయి. ఇవి సమయాన్ని ఆదా చేసి, కస్టమర్లకు గొప్ప అనుభూతిని అందిస్తుంది. ఫోటో ఎడిటింగ్ కోసం AI ఎరేస్ 2.0, ఫోటో ఎన్‌హాన్స్ వంటి ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad