Vivo TWS 5: ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ వివో తన కస్టమర్ల కోసం వివో TWS 5 సిరీస్ ఇయర్‌బడ్‌లు లాంచ్ చేసింది. వివో ఈ తాజా TWS ఇయర్‌బడ్‌లను చైనాలో ఫ్లాగ్‌షిప్ వివో X300 సిరీస్‌తో పాటు పరిచయం చేసింది. కంపెనీ వివో TWS 5 సిరీస్ రెండు వేరియంట్‌లలో తీసుకొచ్చింది. అవి TWS 5, TWS 5 హై-ఫై. ఈ రెండు మోడళ్లలో 11mm డైనమిక్ డ్రైవర్లు, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్‌లు 60dB వరకు బయటి శబ్దాన్ని తగ్గించగలవని కంపెనీ పేర్కొంది. ఈ ఇయర్‌బడ్‌ల ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
వివో TWS 5 సిరీస్ ధర:
కంపెనీ రెండు వేరియంట్‌లలో వస్తోన్న ఈ ఇయర్‌బడ్‌ల స్టాండర్డ్ వేరియంట్ ధర 399 యువాన్లు (సుమారు రూ. 4,500)గా, హై-ఫై వేరియంట్ ధర 499 యువాన్లు (సుమారు రూ. 5,500)గా నిర్ణయించింది. వివో TWS 5 ను సింపుల్ వైట్, ప్యూర్ బ్లాక్, స్మోకీ పర్పుల్ వంటి కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఇక TWS 5 హై-ఫైని డీప్ సీ బ్లూ, వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది.
also read;Samsung Galaxy Z Fold 6 Discount: ఈ శాంసంగ్ ఫోన్‌పై ఏకంగా రూ. 63,000 డిస్కౌంట్..ఇప్పుడే త్వరపడండి!
వివో TWS 5 సిరీస్ ఫీచర్లు:
వివో TWS 5 సిరీస్ ఇయర్‌బడ్‌లు 11mm డ్రైవర్‌లను కలిగి ఉంటాయి. ఇక TWS 5 హై-ఫై వేరియంట్ LDAC, LHDC, AAC, SBC, LC3 కోడెక్‌లకు మద్దతు ఇస్తుంది. అయితే, సాధారణ వివో TWS 5 LDAC, AAC, SBC, LC3 ఆడియో కోడెక్‌లకు మద్దతు ఇస్తుంది. రెండు ఇయర్‌బడ్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌కు మద్దతు ఇస్తాయి. ఇవి 60dB వరకు బయటి శబ్దాన్ని తగ్గిస్తుందని కంపెనీ పేర్కొంది. వివో TWS 5 సిరీస్ ఇయర్‌బడ్‌లు 42ms లేటెన్సీ రేటును అందిస్తాయి. హై-రెస్ ఆడియో సర్టిఫైడ్ పొందాయి. అలాగే ఇవి DeepX 4.0 స్టీరియో సౌండ్‌ను అందిస్తాయి. ఇవి బ్లూటూత్ 5.4 కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి. 10 మీటర్ల వరకు ఆపరేటింగ్ పరిధిని అందిస్తాయి. డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ ఇయర్‌బడ్‌లు IP54 సర్టిఫికేషన్ కలిగి ఉంది.
వివో TWS 5 సిరీస్ ఇయర్‌బడ్‌లు మూడు మైక్రోఫోన్‌లు, ఏఐ-ఆధారిత కాల్ నాయిస్ రిడక్షన్ సిస్టమ్‌ను కలిగి ఉంటాయి. వివో TWS 5, TWS 5 హై-ఫై ఇయర్‌బడ్‌లు రెండూ ట్రిపుల్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తాయి. అవి స్మార్ట్ ట్రాన్స్‌లేషన్‌కు కూడా మద్దతు ఇస్తాయి. ఇవి టచ్ కంట్రోల్‌లను కూడా కలిగి ఉంటాయి. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే..ANC ఆన్‌లో ఉంచి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటల బ్యాటరీ లైఫ్, కేసుతో 24 గంటలు అందిస్తుందని వివో పేర్కొంది. ANC ఆఫ్‌లో ఉంచి బ్యాటరీ లైఫ్ ఒకే ఛార్జ్ చేస్తే 12 గంటలు, కేసుతో 48 గంటలు ఉంటుంది.


