Vivo V60 Lite 5G Launched: ప్రముఖ బ్రాండ్ వివో తన కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ ను తైవాన్‌లో లో లాంచ్ చేసింది. కంపెనీ దీని వివో V60 లైట్ 5G పేరిట తీసుకొచ్చింది. ఈ తాజా పరికరం V-సిరీస్ లో వస్తుంది. కంపెనీ ఇందులో అద్భుతమైన ఫెస్టుర్లను అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 12GB వరకు RAMని కలిగి ఉంటుంది. వివో V60 లైట్ 5G 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇప్పుడు దీని ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
వివో V60 లైట్ 5G: ధర
కంపెనీ వివో V60 లైట్ 5G స్మార్ట్ ఫోన్ 8GBRAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర TWD 12,990 (సుమారు రూ. 38,000)గా, 12GBRAM + 256GB స్టోరేజ్ వేరియంట్ TWD 13,990 (సుమారు రూ. 41,000)గా పేర్కొంది. ఇది మూడు వేర్వేరు రంగు ఎంపికలలో వస్తుంది. ఓషన్ నైట్ బ్లాక్, టైటానియం మిస్ట్ బ్లూ, వైటాలిటీ పింక్ కలర్.
also read:Samsung Galaxy Tab A11 Launched: శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A11 విడుదల..ధర కేవలం రూ.12,999
వివో V60 లైట్ 5G: స్పెసిఫికేషన్లు
ఈ పరికరం 120Hz రిఫ్రెష్ రేట్, 94.20% స్క్రీన్-టు-బాడీ రేషియో, 387ppi పిక్సెల్ డెన్సిటీతో 6.77-అంగుళాల పూర్తి-HD+ (1,080×2,392 పిక్సెల్స్) అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB వరకు LPDDR4x RAM, 256GB UFS3.1 నిల్వతో జత చేశారు. హ్యాండ్‌సెట్ 12GB వరకు విస్తరించదగిన ర్యామ్ కి మద్దతు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్ OS 15 పై నడుస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం, వివో లైట్ లైట్ 5G స్మార్ట్ ఫోన్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒకే ఛార్జ్‌పై 27.5 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్, 14 గంటల నావిగేషన్ సమయాన్ని అందిస్తుందని పేర్కొంది.
కనెక్టివిటీ పరంగా.. ఇది బ్లూటూత్ 5.4, NFC, GPS, బీడౌ, గ్లోనాస్, గెలీలియో, QZSS, A-GPS, Wi-Fi 6, OTG, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ IP65 రేటింగ్‌ను కలిగి ఉంది. అంటే ఇది దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. సెన్సార్లలో ఇ-కంపాస్, డిస్టెన్స్ సెన్సార్, గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్ ఉన్నాయి. దీని కొలతలు 163.77×76.28×7.59mm. దీని బరువు 194 గ్రాములు.


