Saturday, November 15, 2025
Homeటెక్నాలజీVivo V60: 6500mAh బ్యాటరీతో వివో V60 వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు చూస్తే..

Vivo V60: 6500mAh బ్యాటరీతో వివో V60 వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు చూస్తే..

Vivo V60 Launched: వివో తమ వినియోగదారుల కోసం V సిరీస్ కింద మరొక కొత్త పరికరాన్ని మార్కెట్లో విడుదల చేసింది. కంపెనీ దీని వివో V60గా పరిచయం చేసింది. ఈ ఫోన్ వివో V50 అప్‌గ్రేడ్ మోడల్. వివో V60 Zeiss బ్రాండ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఎన్నో అద్భుతమైన ఫెస్టుర్లతో వస్తున్న ఈ పరికరం అనేక AI-ఇమేజింగ్, ఉత్పాదకత సాధనాలును కూడా అందించారు. ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్లు చూద్దాం.

- Advertisement -

Vivo V60 ధర:

కంపెనీ వివో V60 8GB ర్యామ్+128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 36,999గా పేర్కొంది. 8GB ర్యామ్ RAM+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 38,999గా, 12GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,999గానిర్ణయించారు. ఇక టాప్ వేరియంట్ 16GB ర్యామ్+ 512GB స్టోరేజ్ ధర రూ.45,999గా అందుబాటులో ఉంటుంది.

వివో V60 మూడు రంగుల ఎంపికలలో లభిస్తుంది. ఆస్పియస్ గోల్డ్, మూన్‌లైట్ బ్లూ, మిస్ట్ గ్రే. ఈ స్మార్ట్ ఫోన్ అధికారిక వెబ్ సైట్, ఇ-కామర్స్ వెబ్ సైట్లతో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కొనిగొలు చేయొచ్చు. కాగా, ఈ ఫోన్ ఆగష్టు 19 నుండి అందుబాటులో ఉంటుంది.

Also Read: Apple 16: ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది..ఇప్పుడు ఎంతంటే..?

Vivo V60 ఫీచర్లు:

ఈ పరికరం 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది. ఈ ఫోన్ 5,000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 4 ప్రాసెసర్‌తో అమర్చబడి 8GB నుండి 16GB వరకు LPDDR4x RAM వేరియంట్‌లలో వస్తుంది.

ఈ పరికరం ఆండ్రాయిడ్ 15-ఆధారిత ఫన్‌టచ్ OS 15పై నడుస్తుంది. ఈ ఫోన్ అనేక ప్రత్యేక AI ఫీచర్లతో వస్తుంది. వీటిలో AI ఇమేజ్ ఎక్స్‌పాండర్, AI స్మార్ట్ కాల్ అసిస్టెంట్, AI క్యాప్షన్, AI-బ్లాక్ స్పామ్ కాల్ టూల్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం..ఈ ఫోన్‌లో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఇందులో Zeiss-బ్యాక్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంది. దీనితో పాటు, 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్, టెలిఫోటో కెమెరాతో కూడిన ప్రత్యేక 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్-యాంగిల్ లెన్స్ అందుబాటులో ఉంది. సెల్ఫీల కోసం..ఈ ఫోన్‌లో ప్రత్యేక 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ వెనుక కెమెరాలోనే కాకుండా ముందు కెమెరాలో కూడా 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే..ఈ పరికరం 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది. నెక్టివిటీ పరంగా.. ఇందులో Wi-Fi, బ్లూటూత్ 5.4, GPS, NFC, USB టైప్-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68, IP69 రేటింగ్‌ను కలిగి ఉంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad