Vivo V60e 5G Features: ప్రముఖ ఫోన్ తయారీ బ్రాండ్ వివో త్వరలో తమ కస్టమర్ల కోసం సరికొత్త మొబైల్ ను మార్కెట్లో తీసుకురానున్నది. కంపెనీ దీని వివో V60e 5Gని పేరిట విడుదల చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ వివో V50e అప్‌గ్రేడ్ మోడల్ అని సమాచారం. V సిరీస్‌లో వచ్చేస్తోన్న ఈ పరికరంలో కంపెనీ అనేక గొప్ప ఫీచర్లను అందించవచ్చు. వివో వివో V60e 5G స్మార్ట్ ఫోన్ ఖచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించనప్పటికీ, దీని సంబంధించిన ధర, ఫీచర్లు పలు వెబ్ సైట్స్ ద్వారా లీక్ అయ్యాయి.
వివో V60e 5G స్మార్ట్ ఫోన్ లీక్స్..
లీక్స్ ప్రకారం..వివో V60e 5G స్మార్ట్ ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధర దాదాపు రూ. 29 వేల నుండి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అలాగే 8GB + 256GB స్టోరేజీ వేరియంట్ ధర దాదాపు రూ. 31 వేల వరకు, 12GB + 256GB RAM స్టోరేజీ వేరియంట్ ధర రూ. 32 వేల వరకు ఉంటుందని అంచనా. ఇది రెండు వేర్వేరు రంగు ఎంపికలలో రావచ్చు.
వివో V60e 5G స్మార్ట్ ఫోన్ లీకైన ఫోటోలు చూస్తే, ఈ పరికరం హ్యాండ్‌సెట్ డిజైన్ వివో V60కి చాలా పోలి ఉంటుందని చూపిస్తున్నాయి. ఫోన్ టాప్ రైట్ సైడ్ లో డ్యూయల్-కెమెరా సెటప్ ఉంది. అలాగే, కెమెరా ఐలాండ్ పక్కన LED రింగ్ లైట్ ఉంది. అలాగే, పరికరం డిస్ప్లేలో డైమండ్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను చూడవచ్చు.
పనితీరు విషయానికి వస్తే,ఈ వివో పరికరం మీడియాటెక్ 7300 ప్రాసెసర్‌ను పొందవచ్చని ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఇదే ప్రాసెసర్ వివో V50eలో కూడా కనిపిస్తుంది. ఇక దుమ్ము, నీటి నుండి రక్షించడానికి ప్రత్యేక IP68 + IP69 రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ 6,500mAh బ్యాటరీ అందించనుంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.


