Vivo V60e 5G Specifications: భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న వివో V60e 5G స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది. వీవీ V సిరీస్‌లో మిడ్-రేంజ్ విభాగంలో దీన్ని తీసుకొస్తుంది. యూజర్లను ఆకట్టుకునేలా దీన్ని డిజైన్ చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, ధర వివరాలు వెల్లడయ్యాయి. అవేంటో చూద్దాం.
వివో V60e 5G స్పెసిఫికేషన్లు
వివో V60e 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.77 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. స్పీడ్, పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 టర్బో చిప్‌సెట్ ను అందించారు. ఇక, ప్రధానంగా కెమెరా విషయంలో ఇది అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. కెమెరా విషయానికి వస్తే.. వివో V60e 5G ఫోన్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా 200MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో 200MP కెమెరాను అందించడం ఇదే మొదటిసారి. దీనికి 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరా అందించారు. బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే.. ఇందులో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్‌తో 6500mAh బ్యాటరీని అమర్చారు. వివో V60e 5G ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో IP68/IP69ను కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత FuntouchOS 15పై పనిచేస్తుంది. ఈ డివైజ్ మూడేళ్ల పాటు ఓఎస్ అప్‌గ్రేడ్‌లను, ఐదేళ్ల పాటు సేఫ్టీ అప్‌గ్రేడ్‌లను అందుకుంటుంది. ఈ వివరాలన్నీ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయ్యాయి.
వివో V60e ధర ఎంతంటే?
వివో V60e భారత మార్కెట్లో మూడు వేరియంట్‌లలో రిలీజ్ కానుంది. వివో V60e 5G బేస్ వేరియంట్ (8GB RAM + 128GB స్టోరేజ్) ధర సుమారు రూ. 28,749 నుండి ప్రారంభం అవుతుంది. అలాగే 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 30,749గా ఉంటుంది. అంతేకాకుండా, 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ. 32,749గా నిర్ణయించారు. వివో V60e ఫోన్ ఎలైట్ పర్పుల్, నోబుల్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో రిలీజ్ కానుంది. అక్టోబర్ 7 ఈ ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. కాగా, ఇటీవల విడుదలైన వివో వి50ఈ స్మార్ట్ఫోన్కు సక్సెసర్గా ఇది వస్తుంది.
ఈ ఫోన్ పవర్ఫుల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు అత్యుత్తమ పనితీరు కనబరుస్తుంది. 6.77 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే.. వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కెమెరాలను అందించింది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP ఆటోఫోకస్ కెమెరాను చేర్చింది. ఇది 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో 6000mAh బ్యాటరీ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది.


