Vivo X Fold 5 Launched: వివో తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వివో ఎక్స్ ఫోల్డ్ 5ను చైనాలో విడుదల చేసింది. ఇది బుక్-స్టైల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్. ఈ హ్యాండ్‌సెట్ వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో కంటే సన్నగా, తేలికగా ఉందని కంపెనీ పేర్కొంది. తాజా వివో ఫోల్డబుల్ ఫోన్‌లో Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా, రెండు 20MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. అయితే, వివో ఎక్స్ ఫోల్డ్ 5లో ప్రత్యేకత ఏమిటి? ధర, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ధర
వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ 12జీబీ+ 256జీబీ వేరియంట్ ధర 6,999 CNY (సుమారు రూ. 83,000)గా కంపెనీ పేర్కొంది. ఇదే సమయంలో కంపెనీ 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర 7,999 CNY (సుమారు రూ. 96,000)గా, హై-ఎండ్ 16జీబీ+ 512జీబీ వేరియంట్ ధర 8,499 యువాన్లు (సుమారు రూ. 1,02,000)గా, 16జీబీ+ 1TB వేరియంట్ ధర 9,499 యువాన్లు (సుమారు రూ. 1,14,000)గా నిర్ణయించింది. ఈ ఫోన్ గ్రీన్, వైట్, బ్లాక్ రంగులలో లభిస్తోంది. కాగా, ఈ పరికరం జూలై 2 నుండి అధికారిక వెబ్‌సైట్, ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో అమ్మకానికి వస్తుంది.
ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8.03 అంగుళాల 8T LTPO ప్రధాన ఫ్లెక్సిబుల్ ఇన్నర్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఫోన్‌లో 6.53 అంగుళాల 8T LTPO ఔటర్ స్క్రీన్ ఉంది. ఈ పరికరం స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 Hz, లోకల్ పీక్ బ్రైట్‌నెస్ 4500 నిట్స్ కలిగి ఉంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ ను అమర్చారు. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OriginOS 5 తో పనిచేస్తుంది.
ఇక కెమెరా గురించి చెప్పాలంటే.. వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్‌ఫోన్‌లో Zeiss T లెన్స్ కోటింగ్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ సెన్సార్ ఉంది. దీనితో పాటు, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది. కెమెరా టెలిఫోటో మాక్రో ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. లోపలి, బయటి స్క్రీన్‌లలో 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.
వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ కు 80W వైర్డు, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6000mAh బిగ్ బ్యాటరీ ని అందించారు. హ్యాండ్‌సెట్ IP5X రేటింగ్, IPX8+IPX9+IPX9+ రేటింగ్‌ను పొందుతుంది. అంటే ఫోన్ దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ మైనస్ 20 డిగ్రీల సెల్సియస్‌లో కూడా పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.పరికరం బరువు 217 గ్రాములు. ఐఫోన్, ఎయిర్‌పాడ్‌లు, మ్యాక్‌బుక్, ఆపిల్ వాచ్, ఐక్లౌడ్ మొదలైన ఆపిల్ పరికరాలకు వివో ఎక్స్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ మద్దతు ఇస్తుందని వివో ధృవీకరించింది.