VIVO X100 Pro 5G Price and Specifications: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో తన మార్కెట్‌ను విస్తరిస్తోంది. ఇప్పటికే ఎన్నో ప్రీమియం, మిడ్‌రేంజ్ ఫోన్లను లాంచ్ చేసిన వివో.. తాజాగా, వివో ఎక్స్100 పేరిట మరో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇందులో 16 జీబీ ర్యామ్, అమోలెడ్ స్క్రీన్, జీస్ బ్రాండింగ్‌తో కూడిన 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 5400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి చేర్చింది. ఈ ఫోన్ శక్తివంతమైన చిప్‌సెట్‌తో వస్తుంది. వివో ఎక్స్100 ప్రో 5జీ ఫోన్‌పై అమెజాన్ భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. అమెజాన్ ఈ ఫోన్‌పై దాదాపు 38% తగ్గింపును అందిస్తోంది. అదనంగా, బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉన్నాయి. భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అమెజాన్‌లో ఏకంగా 38 శాతం డిస్కౌంట్..
వివో ఎక్స్ 100 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ జనవరి 2024లో రూ. 96,999 ధర వద్ద లాంచ్ అయింది. అయితే, అమెజాన్‌లో ఇప్పుడు 38 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.59,999 ధర వద్ద లభిస్తుంది. అంటే, వివో ఎక్స్ 100 ప్రో 5జీ ఫోన్‌పై దాదాపు రూ.37 వేల డిస్కౌంట్‌తో పాటు అదనంగా, బ్యాంక్ ఆఫర్లు కూడా లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఫోన్‌పై రూ.3 వేల వరకు ఆదా చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి ఈఎంఐ లావాదేవీలపై రూ.1,799 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా దీని ధర మరింతగా తగ్గనుంది.
వివో ఎక్స్ 100 స్పెసిఫికేషన్లు ఇవే..
ఇక, ఫీచర్ల విషయానికి వస్తే.. వివో ఎక్స్100 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల అమోలెడ్ 8టీ LTPO కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్‌ల గరిష్ట ప్రకాశం, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్షిటీ 9300 ప్రాసెసర్, వివో కొత్త V3 ఇమేజింగ్ చిప్ ద్వారా పనిచేస్తుంది. వివో ఎక్స్ 100 ప్రో ఫోన్‌లో Zeiss బ్రాండింగ్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే.. మెయిన్ సెన్సార్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX989 1 అంగుళాల సెన్సార్, ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఇస్తుంది. దీనితో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సూపర్ టెలిఫోటో కెమెరా వంటివి ఉన్నాయి. టెలిఫోటో కెమెరా 4.3x ఆప్టికల్ జూమ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ప్రైమరీ షూటర్, టెలిఫోటో కెమెరా రెండూ 100 ఎక్స్ డిజిటల్ జూమ్ వరకు అందిస్తాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఫోన్‌లో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం ఫోన్ IP68 రేటింగ్ కలిగి ఉంది. వివో ఎక్స్100 ప్రో.. 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 5,400mAh బ్యాటరీతో వస్తుంది.


