Vivo X200 FE launched: వివో తన కొత్త కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ Vivo X200 FEని భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. వివో X200 FE కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఫీచర్లతో వస్తోంది. ఈ పరికరం శక్తివంతమైన 6,500mAh బ్యాటరీ, అధితమైన కెమెరా సెటప్, డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. కంపెనీ ఈ పరికరాన్ని ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ X ఫోల్డ్ 5తో పాటు మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ధర, ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Vivo X200 FE ధర
కంపెనీ ఇండియాలో వివో X200 FE కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్ 12GB + 256GB వేరియంట్ స్టోరేజ్ ధర రూ.54,999గా పేర్కొంది. మరోవైపు 16GB + 512GB వేరియంట్ స్టొరాజ్ ధర రూ.59,999గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ అంబర్ ఎల్లో, ఫ్రాస్ట్ బ్లూ, లక్స్ గ్రే రంగులలో లభిస్తుంది. కాగా, ప్రీ-ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ జూలై 23 నుండి ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.
Vivo X200 FE ఫీచర్లు
ఈ పరికరం 6.31-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే 1800 నిట్‌ల గరిష్ట ప్రకాశం, HDR 10+తో షీల్డ్ గ్లాస్ రక్షణకు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ MediaTek ఫ్లాగ్‌షిప్ Dimensity 9300+ ప్రాసెసర్ ను అమర్చారు. ఇది 16GB వరకు LPDDR5X RAM, 512GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ Android 15 ఆధారంగా FuntouchOS 15 తో నడుస్తుంది.
Also Read: iQOO Z10R: ఐక్యూ నుంచి కొత్త ఫోన్..లాంఛ్‌కు ముందే స్పెక్స్ లీక్..
కెమెరా గురించి చెప్పాలంటే.. ఇది Zeiss-ట్యూన్ చేయబడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది OISతో 50MP సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం.. 50MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.
ఈ ఫోన్ 6,500mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ IP68, IP69 సర్టిఫికేషన్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. అంటే ఇది ఎక్కువగా నీరు, ధూళి నుండి రక్షించబడుతుంది. కనెక్టివిటీ పరంగా ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్, Wi-Fi, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB-C పోర్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఉన్నాయి. దీని మందం కేవలం 8mm.


