Friday, February 13, 2026
Homeటెక్నాలజీVivo X300 Series Launched: 200MP కెమెరాతో వివో X300 స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్..ధర,...

Vivo X300 Series Launched: 200MP కెమెరాతో వివో X300 స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్..ధర, ఫీచర్ల పూర్తివివరాలివే!

Vivo X300, Vivo X300 Pro Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వివో తన కొత్త X300 సిరీస్‌ను ఇండియాలో అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ ఈ సిరీస్‌ను వివో X200 లైనప్‌కు కొనసాగింపుగా తీసుకొచ్చింది. అక్టోబర్ లో ఈ స్మార్ట్ ఫోన్లను చైనాలో రిలీజ్ చేసిన కంపెనీ తాజాగా భారత టెక్ మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ ఈ సిరీస్‌లో వివో X300, వివో X300 ప్రో పేరిట రెండు మోడళ్లను తీసుకొచ్చింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు డిసెంబర్ 10 నుంచి విక్రయానికి రానున్నాయి. వీటిని వివో ఇండియా వెబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ ఫ్లాట్ ఫామ్ లతో పాటు ఇతర రిటైల్ స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చు. కెమెరా ప్రియులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ధర, లభ్యత, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Vivo X300 ధర, ఫీచర్లు:

వివో X300 స్మార్ట్ ఫోన్ 120Hz వరకు రిఫ్రెష్ రేటుతో 6.31-అంగుళాల 1.5K అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ పరికరం 300Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటు, HDR మద్దతును అందిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 16GB వరకు LPDDR5x అల్ట్రా ర్యామ్, 512GB వరకు UFS 4.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫ్లాగ్‌షిప్ పరికరం ఆండ్రాయిడ్ 16-ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6పై నడుస్తుంది. ఫోన్‌లో ప్రో ఇమేజింగ్ VS1 చిప్, V3+ ఇమేజింగ్ చిప్ కూడా ఉన్నాయి.

also read:Samsung Galaxy S24 Discount: ఆఫర్ అంటే ఇదే..శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 పై ఏకంగా రూ.40 వేల డిస్కౌంట్!

కెమెరా విషయానికి వస్తే..ఈ వివో పరికరం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 200-మెగాపిక్సెల్ HPB ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ పరికరంలో OIS తో కూడిన 50-మెగాపిక్సెల్ (f/2.57) సోనీ LYT-602 టెలిఫోటో లెన్స్, 50-మెగాపిక్సెల్ (f/2.0) శామ్‌సంగ్ JN1 అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం.. ఇందులో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాను అందించారు. బ్యాటరీ పరంగా..ఇది 6040mah లిథియం అయాన్ బ్యాటరీతో 90w వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40w వైర్ లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇక అవార్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69రేటింగ్ లను కలిగి ఉంది.

ధర విషయానికి వస్తే..వివో X300 మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 12GB+256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.75,999గా పేర్కొంది. అలాగే 12GB+512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.రూ.81,999గా, 16GB+512GB RAM స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.85,999గా నిర్ణయించింది. ఈ పరికరం ఎలైట్ బ్లాక్, మిస్ట్ బ్లూ, సమ్మిట్ రెడ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది.

 

వివో X300 ప్రో ధర, ఫీచర్లు:

ఈ వివో ప్రో పరికరం 120Hz వరకు రిఫ్రెష్ రేటుతో 6.78-అంగుళాల 1.5K LTPO అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 94.85 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి, 300Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది. డిస్‌ప్లే HDR10+ కంటెంట్‌కు మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఫ్లాగ్‌షిప్ పరికరం ఆండ్రాయిడ్ 16-ఆధారిత ఆరిజిన్ఓఎస్ 6పై నడుస్తుంది. ఫోన్‌లో ప్రో ఇమేజింగ్ VS1 చిప్, V3+ ఇమేజింగ్ చిప్ కూడా ఉన్నాయి.

also read:Spinach Juice Benefits: పాలకూర రసంతో బోలెడు ప్రయోజనాలు..ఎలా తయారు చేసుకోవాలి..?ఎవరు తాగకూడదు..?

ఫోటోగ్రఫీ కోసం..ఈ ఫోన్ లో Zeiss-ట్యూన్ చేయబడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ పరికరం 50-మెగాపిక్సెల్ (f/1.57) Sony LYT-828 ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ (f/2.0) శామ్సంగ్ JN1 అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 200-మెగాపిక్సెల్ (f/2.67) HPB APO టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో పరికరం 50-మెగాపిక్సెల్ (f/2.0) శామ్సంగ్ JN1 సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. ఇది 6150mah బ్యాటరీని కలిగి ఉంది. ఇది 90w వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40w వైర్ లెస్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇక అవార్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69రేటింగ్ లను కలిగి ఉంది.

ధర గురించి మాట్లాడితే.. వివో X300 ప్రో ను సింగల్ వేరియంట్లో తీసుకొచ్చారు. కంపెనీ 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.109,999గా నిర్ణయించింది. ఇది డ్యూన్ గోల్డ్, ఎలైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News