Vivo X300 series SmartPhones Launch in Europe: Vivo X300 series
గతంలో ఈ స్మార్ట్‌ఫోన్లు చైనాలో విడుదల చేసింది. త్వరలోనే ఇవి భారత మార్కెట్‌లోకి రానున్నాయి. ఈ రెండు ఫోన్లు మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. మరి ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ధర, ఫీచర్లపై ఓలుక్కేద్దాం.
వివో ఎక్స్ 300, వివో ఎక్స్300 ప్రో ధర
వివో ఎక్స్ 300, వివో ఎక్స్300 ప్రో రెండు స్మార్ట్‌ఫోన్లు నిన్న యూరోపియన్ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. వివో ఎక్స్ 300 యూరప్‌లో సుమారు రూ. 1,07,600 (భారత కరెన్సీలో) వద్ద రిలీజైంది. ఈ ఫోన్ 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. అదేవిధంగా, 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ కలిగిన వివో ఎక్స్ 300 ప్రో ధరను యూరప్ మార్కెట్‌లో రూ. 1,43,500 వద్ద కంపెనీ రిలీజ్ చేసింది. ఎక్స్300 ఫాంటమ్ బ్లాక్, హాలో పింక్ కలర్ ఆప్షన్లలో రిలీజైంది. మరోవైపు, X300 ప్రో ఫాంటమ్ బ్లాక్, డ్యూన్ బ్రౌన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/cabinet-rank-for-sudarshan-reddy-and-premsagar-rao/
వివో ఎక్స్ 300, వివో ఎక్స్300 ప్రో స్పెసిఫికేషన్లు
యూరోపియన్, చైనీస్ స్మార్ట్‌ఫోన్ వేరియంట్లలో చాలా వరకు స్పెసిఫికేషన్లు ఒకేలా ఉంటాయి. కొన్ని స్వల్ప తేడాలు మాత్రమే కనిపిస్తాయి. వివో ఎక్స్ 300.. 6.31 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అయితే, ప్రో మోడల్ 6.82 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ రెండు ఫోన్లలో 8T LTPO డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. భద్రత కోసం దీనిలో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను అందించారు. ఈ రెండు ఫోన్లు 90W వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. వివో X300లో శామ్‌సంగ్ హెచ్‌బీసీ సెన్సార్‌తో కూడిన 200 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది. దీనికి 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-602 టెలిఫోటో లెన్స్ కెమెరాను కూడా అందించారు. మూడవ కెమెరాలో 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ ఉంటుంది. వివో ఎక్స్300 ప్రో విషయానికి వస్తే.. దీనిలో 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ-828 ప్రైమరీ కెమెరా, 200 ఎంపీ శామ్‌సంగ్ హెచ్‌పీబీ టెలిఫోటో కెమెరా, అల్ట్రావైడ్ యాంగిల్ ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ JN1 సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. ఇది 50 ఎంపీ శామ్‌సంగ్ జేఎన్1 సెన్సార్ ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఓరిజన్ ఓఎస్‌పై పనిచేస్తాయి. ఈ ఫోన్ 5,360mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, దీని చైనీస్ వేరియంట్ మాత్రం 6,040mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అదేవిధంగా యూరప్‌లో విడుదలైన వివో X300 ప్రో ఫోన్ 5,440mAh బ్యాటరీ. చైనీస్ వేరియంట్ 6510mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.


